Gangster Movies : సౌత్ టూ నార్త్.. గ్యాంగ్ స్టార్స్ గా కనిపించబోతున్న హీరోలు వీరే !

సౌత్ ఇండియా నార్త్ ఇండియా అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలోనూ ప్రస్తుతం ఒక ట్రెండ్ నడుస్తుంది.అదే గ్యాంగ్ స్టార్ ట్రెండ్.

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అందరూ కూడా మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రాలలోనే నటిస్తున్నారు.సౌత్, నార్త్ అనే తేడా లేదు సీనియర్స్, జూనియర్స్ అనే భేదం లేదు.

అందరూ కూడా గన్నులు పట్టుకొని, కత్తులు పట్టుకొని ఫైట్స్ చేయడానికి సిద్ధపడి పోతున్నారు దాంతో రాబోయే ఏడాది కాలం పాటు అంత వెండితెరపై విధ్వంసం ఖాయం అని తెలుస్తోంది.ఇంతకీ అన్ని భాషలలో వస్తున్న గ్యాంగ్ స్టార్ సినిమాలు( Gangster Movies ) ఏంటి? ఏ హీరోలు నటిస్తున్నారు అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అల్లు అర్జున్( Allu Arjun ) ఇప్పటికే పుష్ప సినిమాతో గ్యాంగ్ స్టార్ గా మారిన విషయం మనందరికీ తెలుసు ఇక రెండవ పార్ట్ కూడా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటుంది ఈ సినిమాలో ఒక భయంకరమైన గ్యాంగ్ మెయింటైన్ చేసే డాన్ గా కూడా కనిపించబోతున్నాడు అల్లు అర్జున్.

Advertisement

తగ్ లైఫ్( Thug Life ) అనే సినిమాతో చాలా ఏళ్ల తర్వాత మణిరత్నం కమల్ హాసన్ కలిసి పనిచేస్తున్నారు.నాయకుడు సినిమా వీరిద్దరి కాంబినేషన్లో ఇది వరకే రాగా దానికి సీక్వెల్ గా ఈ చిత్రంలో కమల్ హాసన్( Kamal Haasan ) భయంకరమైన గ్యాంగ్ స్టార్ గా కనిపించబోతున్నారు.

ఇక మటన్ కొట్టే వ్యక్తిగా మరోవైపు సొంత గ్యాంగ్ కూడా మైంటైన్ చేసే పాత్రలో నటిస్తున్నట్టు క్లారిటీ ఇచ్చేశాడు ధనుష్( Dhanush ). తను తీయబోతున్న రాయన్ చిత్రం యొక్క పోస్టర్ ద్వారా ఈ విషయాలు స్పష్టం అవుతున్నాయి.మరోవైపు ధనుష్ నాగార్జునతో మల్టీ స్టార్ సినిమా చేస్తుండగా ఇందులోను గ్యాంగ్ స్టార్ పాత్రను పోషిస్తున్నాడు.

శాండిల్ వుడ్ లో కేజిఎఫ్ సినిమాతో గ్యాంగ్ స్టార్ గా ఇప్పటికే కనిపించిన యష్( Hero Yash ) మరో మారు అదే తరహా పాత్రలో కనిపించబోతున్నాడు.ఇక మలయాళ ఇండస్ట్రీ స్టార్ హీరో మోహన్ లాల్ సైతం ఇప్పుడు అదే పనిలో ఉన్నాడు.ఇప్పటికే లూసిఫర్ అనే సినిమాలో నటించిన మోహన్ లాల్ దానికి సీక్వెల్ గా వస్తున్న చిత్రంలో వరల్డ్ వైడ్ గ్యాంగ్ స్టార్ గా కనిపించబోతున్నారు.

సింప్లిసిటీకి పర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌ ప్రభాస్‌.. వైరల్ అవుతున్న శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Advertisement

తాజా వార్తలు