కాంగ్రెస్ vs బీజేపీ.. ధర్నాకు దిగిన పాల్వాయి స్రవంతి!!

మునుగోడు ఎన్నికలు వాడీవేడీగా జరుగుతున్నాయి.ప్రధాన పార్టీలు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ప్రచారంలో వేగం పెంచాయి.

ఇప్పటికే దీపావళి కానుకగా ఇంటింటికీ బహుమతులు కూడా పంచిపెట్టాయి.అయితే ప్రచారం ఎలా కొనసాగుతున్న ఇరు పక్షాల మధ్య పోరు, వాదనలు మాత్రం తగ్గడం లేదు.

ఒకరిపై మరొకరు ఆరోపణలు చేస్తూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చింది.

తన కాన్వాయికి దారి ఇవ్వకుండా అడ్డుపడిన బీజేపీ నేతలను అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి పాల్వాయి స్రవంతి డిమాండ్ చేశారు.మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఆదివారం కాంగ్రెస్ శ్రేణులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు.

Advertisement

బీజేపీ, ప్రధాని మోడీ, కోమటిరెడ్డి వెంకట గోపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేసి ఆందోళనకు దిగారు.దాదాపు రెండు గంటలపాటు ధర్నా కొనసాగుతోంది.

దీంతో ట్రాఫిక్ సమస్య ఎదురైంది.ఎక్కడిక్కడే వాహనాలు నిలిచిపోయాయి.

ఈ సందర్భంగా ధర్నాలో పాల్వాయి స్రవంతి మాట్లాడుతూ.‘ఎన్నికలకు హాజరవ్వడానికి వెళ్తున్నప్పుడు తన కారును అడ్డుకున్నారు.

దారి ఎందుకు ఇవ్వడం లేదని అడిగినందుకు తన కారు డ్రైవర్‌ను, మహిళా కార్యకర్తలను బీజేపీ కార్యకర్తలు భయాందోళనకు గురి చేస్తున్నారు.ఇలాంటి విషయాలను సహించేది లేదు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భైరవం సినిమాతో సక్సెస్ సాధిస్తాడా..?
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో కొత్త సినిమాకి కమిట్ అయిన రవితేజ...డైరెక్టర్ ఎవరంటే..?

కాంగ్రెస్ పార్టీని ముంచి బీజేపీలో చేరి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.

Advertisement

కార్యకర్తలపై దాడులకు దిగడం కరెక్ట్ కాదు.’ అని హితువు పలికారు.కాగా, మునుగోడు ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీకి గతంలో ఎన్నడూ లేని విధంగా కమ్యూనిస్టులు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.

ఉప ఎన్నికలో కమ్యూనిస్టులు తీసుకున్న స్ట్రాటజీపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.సీపీఎం, సీపీఐ రాష్ట్ర నాయకులు అగ్రనేతలు చొరవ తీసుకుని మతతత్వ బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి లేకపోవడంతో.టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకున్నారు.

కానీ టీఆర్ఎస్‌తో పొత్తు పట్టుకున్నప్పటి నుంచి కమ్యూనిస్టు కార్యకర్తలో కాస్తంత అసహనం ఎదురైంది.

తాజా వార్తలు