యాంకర్ శివ పై పల్లవి ప్రశాంత్ పరువు నష్టం దావా..ఏకంగా 50 మంది లాయర్లు రంగంలోకి!

సీజన్ బిగ్ బాస్ షో ( Bigg Boss Show )ఎంత పెద్ద హిట్ అయ్యిందో, వివాదాలు కూడా ఆ షో మీద అన్ని ఉన్నాయి.

టైటిల్ విన్నర్ గా గెలిచి బయటకి వచ్చిన తర్వాత రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth ) రూల్స్ ని అతిక్రమించి చేసిన కొన్ని పనులకు ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపిన సంగతి అందరికీ తెలిసిందే.

సుమారుగా రెండు రోజుల పాటు జైలు లో గడిపిన పల్లవి ప్రశాంత్ ని బైలు మీద బయటకి తీసుకొని రావడం కోసం ఆయన స్నేహితులు చాలా కష్టపడ్డారు.ముఖ్యంగా సీజన్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వచ్చిన భోలే ( Bhole Shavali )పల్లవి ప్రశాంత్ మీద ఎంత ప్రేమ చూపించే వాడో మన అందరికీ తెలిసిందే.

హౌస్ లో కొనసాగడానికి స్పై బ్యాచ్ ఓట్ల కోసం భోలే అలా చేసాడేమో అని అందరూ అప్పట్లో అనుకున్నారు.కానీ బయటకి వచ్చిన తర్వాత కూడా ఆయన ప్రశాంత్ పై అదే అభిమానం ని చూపించాడు.

తన పలుకుబడి ని ఉపయోగించి తనకి తెలిసిన టాప్ లాయర్స్ అందరినీ పిలిపించాడు .సుమారుగా 50 మంది లాయర్స్ ప్రశాంత్ బైలు కోసం పని చెయ్యడానికి ముందుకు వచ్చినట్టు సమాచారం.చివరికి ప్రశాంత్ కి బైలు ఇప్పించి బయటకి తీసుకొచ్చారు.

Advertisement

అయితే బయటకి వచ్చిన ప్రశాంత్ తన లాయర్స్ తో యాంకర్ శివ మరియు కొంతమంది ప్రముఖ యూట్యూబర్స్ పై పరువు నష్టం దావా వేసేందుకు సిద్ధం అయ్యాడు.యాంకర్ శివ రీసెంట్ గా తనకి ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పి ఇంటికి పిలిచి చివరికి ఇంటర్వ్యూ ఇవ్వకపోగా బూతులు తిడుతూ మమల్ని అవమానించాడు అంటూ తన యూట్యూబ్ ఛానల్ లో ప్రశాంత్ కి నెగటివ్ గా ఒక వీడియో చేసి వదిలాడు.

ప్రశాంత్ కేవలం యాంకర్ శివ( Anchor Shiva ) మీద మాత్రమే కాదు, పలువురి యూట్యూబ్ చానెల్స్ రిపోర్టర్స్ మీద కూడా అలాగే విరుచుకుపడ్డాడు.

అయితే తనపై కావాలని నిందలు వేశారని, తన పరువుకు భంగం కలిగించారని, కచ్చితంగా నా పరువు పోయింది కాబట్టి వాళ్ళందరి మీద పరువు నష్టం దావా వేస్తాను అంటూ పల్లవి ప్రశాంత్ చెప్పుకొచ్చాడు.ఈ వివాదం ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.ప్రశాంత్ ప్రస్తుతం జైలు నుండి విడుదలై నిన్న సాయంత్రమే ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు.

ప్రతీ ఆదివారం ఆయన పోలీస్ స్టేషన్ కి వచ్చి కచ్చితంగా సంతకం చెయ్యాలి.ఎదో గెలిచినా ఉత్సాహం లో చేసిన పనికి ప్రశాంత్ ని ఒక క్రిమినల్ లాగ ట్రీట్ చెయ్యడం అసలు ఏమాత్రం బాగాలేదని ఆయన అభిమానులు సోషల్ మీడియా లో నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఎలాన్ మస్క్ కూడా కాపీ కొడతాడా.. ఆ డైరెక్టర్ సంచలన ఆరోపణలు..?
Advertisement

తాజా వార్తలు