అయస్కాంతంతో ఫ్లైట్ ఎక్కాలని చూసిన పాకిస్థానీ వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి..

పాకిస్థాన్( Pakistan ) నుంచి వచ్చిన ఒక వింతైన వీడియో ఇన్‌స్టాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

దుబాయ్ లో ఉద్యోగం కోసం వెళ్లాలని ఒక వ్యక్తి ఏకంగా విమానాన్ని( Flight ) ఆపడానికి ప్రయత్నించాడు.

ఎలాగంటే ఒక పెద్ద అయస్కాంతాన్ని ఉపయోగించి, అవును ఈ విడ్డూరమైన పని చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు.కొందరైతే అయ్యో పాపం అని జాలి పడుతున్నారు.

వీడియో మొదట్లో ఒక విమానం టేకాఫ్ తీసుకుంటూ ఆకాశంలోకి ఎగురుతుంది.సీన్ కట్ చేస్తే, ఒక పాకిస్థానీ వ్యక్తి చేతిలో పెద్ద అయస్కాంతం,( Magnet ) దానికి తాడు కట్టి ఉండటం చూస్తాం.

వెంటనే ఆ అయస్కాంతాన్ని విమానం వైపు విసురుతాడు.ఆశ్చర్యంగా అది విమానం వెనుక భాగంలో అతుక్కుంటుంది.

Advertisement

ఇక అంతే, సినిమాల్లో హీరోలాగా తాడు పట్టుకుని విమానాన్ని వెనక్కి లాగడానికి విశ్వప్రయత్నం చేస్తాడు.అలా గాల్లో వెళ్తున్న విమానాన్ని ఆపడం సాధ్యమయ్యే అవకాశం లేదు.

అయితే ట్విస్ట్ ఏంటంటే, విమానం పైలట్ కి వెనుక ఏదో తేడాగా అనిపిస్తుంది.ఏంటా అని అనుమానంతో విమానం వెనుక డోర్ తెరిచి చూస్తాడు.షాక్, అక్కడ విమానానికి ఒక పెద్ద అయస్కాంతం అతుక్కుని ఉంటుంది.

కిందకి చూస్తే తాడు పట్టుకుని ఒక మనిషి వేలాడుతూ కనిపిస్తాడు.పైలట్ వెంటనే "ఏం చేస్తున్నావ్ నువ్వు?" అని అడుగుతాడు.అప్పుడు ఆ వ్యక్తి అమాయకంగా "నేను మీతో దుబాయ్ రావాలి" అని బదులిస్తాడు.

పైలట్ "ఎయిర్ పోర్ట్ కి వచ్చి మామూలుగా టికెట్ కొనుక్కొని రావచ్చు కదా?" అని అంటాడు.దానికి ఆ వ్యక్తి "నా దగ్గర పాస్ పోర్ట్ లేదు, వీసా లేదు" అని అసలు విషయం చెప్పేస్తాడు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 8, బుధవారం 2023

అందుకే ఇలా పిచ్చి ప్రయత్నం చేశానంటూ వాపోతాడు.అక్కడితో వీడియో ముగుస్తుంది.

Advertisement

ఈ వీడియో ఫిబ్రవరి 6న పోస్ట్ చేయగా, ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇన్స్టాగ్రామ్ లో "మరింత పాకిస్థానీ కంటెంట్ కావాలా?" అనే క్యాప్షన్ తో షేర్ చేస్తున్నారు.వీడియోలో ఫన్నీగా "నేను ఒక్కడినే ఎందుకు చూడాలి? అని మెసేజ్ కూడా పెట్టారు.కామెంట్స్ సెక్షన్ అయితే నవ్వులతో నిండిపోయింది.

ఒక యూజర్ "ఈ పాకిస్థానీలు మరీ ఇంత ఖాళీగా ఎలా ఉంటారయ్యా బాబు?" అని కామెంట్ చేస్తే, మరొకరు "నిరుద్యోగం అల్ట్రా ప్రో మాక్స్ (రోజ్ గోల్డ్ ఎడిషన్)" అంటూ సెటైర్ వేశారు.ఇంకొక నెటిజన్ అయితే "అల్యూమినియం ఎప్పుడు నుండి అయస్కాంతానికి అతుక్కోవడం మొదలుపెట్టింది?" అని పంచ్ వేశాడు.ఏదేమైనా ఈ వీడియో మాత్రం తన విచిత్రమైన, హాస్యభరితమైన కంటెంట్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తూ దూసుకుపోతోంది.

తాజా వార్తలు