పాతకాలంనాటి వస్తువైనా లేదా ఏదైనా కాగితం ముక్కైనా దానికి ఈరోజుల్లో చాలా విలువ ఉంటుందని చెప్పవచ్చు.
అప్పటి కాలం ఎలా ఉండేది, అప్పటి మనుషులు ఎలా బతికేవారు వంటి వివరాలను తెలిపే ఈ పాత కాలం నాటి వస్తువులు, కాగితాలు, బిల్లులను ప్రజలు అపురూపంగా చూసుకుంటారు.
కాగా తాజాగా 76 ఏళ్ల క్రితం నాటి ఒక ట్రైన్ టికెట్ వైరల్‌గా మారింది.స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో పాకిస్థాన్ నుంచి భారత్‌కు వెళ్లేందుకు అప్పటి ప్రజలు తీసుకున్న ఈ పాత టికెట్ సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.
వైరల్ అవుతున్న సోషల్ మీడియా పోస్ట్ ప్రకారం రావల్పిండి నుంచి అమృత్‌సర్ మధ్య 1947లో తొమ్మిది మందికి టిక్కెట్టు ధర 36 రూపాయల 9 అణాలు మాత్రమే.ఈ టిక్కెట్టు ఫొటోను పాక్ రైల్ లవర్స్ అనే ఫేస్‌బుక్ పేజీ పోస్ట్ చేసింది.ఆ పోస్ట్‌లో టికెట్ డేట్‌ను 17-09-1947గా, టికెట్ ధరను 36 రూపాయలు & 9 అణాలుగా రాశారు.
అలాగే ఒక కుటుంబం పాక్ నుంచి భారతదేశానికి వలస వచ్చి ఉండవచ్చని పేర్కొన్నారు.
ఈ పోస్ట్ వెంటనే చాలా మంది దృష్టిని ఆకర్షించింది.ఈ ఓల్డ్ మెమరీని ఇలా కాగితంలా ఉంచే కంటే ల్యామినేట్ చేసి దానిని ప్రదర్శనలో పెట్టడం మంచిది అని ఇంకొకరు కామెంట్ చేశారు.75 ఏళ్లు ఉంచినా ఈ బిల్లు కొన్ని రోజుల క్రితం కొన్నట్లే ఉంది.ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఇంకొకరు కామెంట్ చేశారు.
" 76 ఏళ్ల క్రితం 36 రూపాయలు, 9 అణాలు అంటే చాలా పెద్ద అమౌంట్." అని ఒక ఫేస్‌బుక్ యూజర్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy