అత‌న్ని రెస్టారెంట్ల‌కు రానివ్వ‌ని ఓన‌ర్లు.. తిండి పెట్ట‌లేకపోతున్నామ‌ని ఆవేద‌న‌

మన ఇంట్లో ఒక్కరైన మంచి భోజన ప్రియులు ఉంటారు.నచ్చిన కర్రీ, ఫుడ్ ఐటమ్స్ కనిపిస్తే చాలు నిమిషాల్లో లాగించేస్తుంటారు.

కడుపు నిండాకే అక్కడి నుంచి లేస్తారు.అయితే, కొందరు ఇంట్లోని భోజనాన్ని ఇష్టంగా తింటుంటారు, మరికొందరేమో భయట స్ట్రీట్ ఫుడ్స్, రెస్టారెంట్ ఆహారాన్ని ఇష్టంగా తింటుంటారు.

కొందరైతే చిరుతిండ్లు ఎక్కువగా తింటుంటారు.వీరికి ఆహారం తీసుకోవడం కంటే స్నాక్స్ మీదే వీరి ధ్యాసంతా ఉంటుంది.

అయితే, ఓ వ్యక్తి ఇలానే మంచి భోజన ప్రియుడు.బాగా ఆకలి వేసి ఓ రెస్టారెంట్‌కు వెళ్లాడు.

Advertisement
Owners Who Did Not Let Him Go To Restaurants Complained That We Could Not Feed H

ఫుల్ మీల్స్ ఆర్డర్ ఇచ్చాడు.ఫుల్ మీల్స్ అంటే మనం వద్దు అనేవరకు వాళ్లు పెట్టాలి.

దీని ధర సింగిల్ ప్లేట్ కంటే ఎక్కువగా ఉంటుందని అందరికీ తెలిసిందే.అయితే, ఈ వ్యక్తి భోజనం చేశాక రెస్టారెంట్ వాళ్లు మళ్లీ ఇంకొక సారి రావొద్దని వేడుకున్నారట.

నీకు తిండి పెట్టడం మా వల్ల కాదని దండం పెట్టారట.ఎందుకో తెలియాలంటే రీడ్ దిస్ స్టోరీ.

చైనా దేశానికి కాంగ్.మంచి భోజన ప్రియుడు.

షియోమి/ రెడ్ మీ మొబైల్స్ లో మీకు పనికివచ్చే 7 రహస్య ట్రిక్స్

ఛాంగ్‌షా నగరంలోని బీబీక్యూ బఫే రెస్టారెంట్‌‌కు వెళ్లాడు.ఫుల్‌ మీల్స్‌ ఆర్డర్‌ చేశాడు.

Advertisement

సాధారణంగా ఎవరైనా కడుపుకు సరిపడా తింటారు.కానీ మనోడు ఏకంగా 5 కిలోల ఫుడ్ లాగించేశాడు.

అలా 2 సార్లు వెళ్లి 5 కిలోల కంటే ఎక్కవగా ఆహారం తిన్నాడు.దీంతో రెస్టారెంట్ వాళ్లు మనోడికి దండం పెట్టి మళ్లీ ఇంకొసారి రెస్టారెంట్‌కు రావొద్దని చెప్పారట.

ఈ విషయాన్ని కాంగ్ లైవ్ స్ట్రీమ్‌ పెట్టి ఈ రెస్టారెంట్ వాళ్లు తనపై వివక్ష చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారట.

వాస్తవానికి రెస్టారెంట్ వాళ్లు చేసింది కరెక్టే అని ఎవరైనా అంటారు.ఒక్కసారి 5కేజీలు తిన్నాడంటే ఇలా రోజు చేస్తే హోటల్ మూసుకోవాల్సిందే.కాంగ్ సాధారణ మనుషులు తిన్నట్టు తినడట.

ఒకేసారి 20 టు 30 బాటిళ్ల సోయా మిల్క్ తాగేస్తాడట.పంది మాంసం, రొయ్యెల వేపుడును ఒకటి రెండు పీసులు కాకుండా ట్రే మొత్తం ఖాళీ చేసి పడేస్తాడని రెస్టారెంట్ వాళ్లు చెప్పడంతో అంతా షాక్ అయ్యారు.

దీంతో నెటిజన్లు తమకు నచ్చినట్టు స్పందిస్తున్నారు.

తాజా వార్తలు