2024 లోక్‌సభ ఎన్నికలు : మోడీ మరోసారి గెలవాలని .. అమెరికాలో బీజేపీ మద్ధతుదారుల భారీ కార్ ర్యాలీ

త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్రమోడీ( Narendra Modi ) సారథ్యంలోని ఎన్డీయే కూటమి మరోసారి విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ అమెరికాలోని బీజేపీ ఓవర్సీస్ ఫ్రెండ్స్ 20 వేర్వేరు అమెరికన్ నగరాల్లో కార్ ర్యాలీలు నిర్వహించారు.

మోడీకి మూడోసారి అధికారం దక్కాలని మద్ధతు తెలియజేయడంతో పాటు బీజేపీకి 400 ప్లస్ సీట్లు ఇవ్వాలని భారత ప్రజలను వారు కోరారు.

మోడీ నేతృత్వంలోని బీజేపీ, ఎన్డీయేలు( BJP , NDL ) 400 సీట్లు దాటేందుకు భారతీయ అమెరికన్ కమ్యూనిటీ చాలా ఉత్సాహంగా వుందన్నారు .OFBJP-USA అధ్యక్షుడు అడపా ప్రసాద్ మాట్లాడుతూ.లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డీఏ ‘‘అబ్ కీ బార్ 400 పార్’( Ab Key Bar 400 Par )’ సాధించాలని భారతీయ అమెరికన్లు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు.

భారతీయ అమెరికన్ కమ్యూనిటీలో ఇంతటి ఉత్సాహాన్ని తానెప్పుడూ చూడలేపదని ప్రసాద్ పేర్కొన్నారు.

OFBJP-USA కార్యదర్శి వాసుదేవ్ పటేల్( OFBJP-USA Secretary Vasudev Patel ) మాట్లాడుతూ .అమెరికాలోని 20 నగరాల్లో సమన్వయంతో నిర్వహించిన కార్ ర్యాలీలో కమ్యూనిటీ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు.వాషింగ్టన్ డీసీ మెట్రో ప్రాంతంలో వర్జీనియా , మేరీలాండ్‌లలో కార్ల ర్యాలీ జరిగింది.

Advertisement

న్యూజెర్సీలో దాదాపు 200 కార్లు ఈ కార్నివాల్‌లో పాల్గొన్నాయి.సిలికాన్ వ్యాలీలో ఫ్రీమాంట్ వార్మ్ స్ప్రింగ్స్ , సౌత్ ఫ్రీమాంట్ బార్ట్ స్టేషన్ నుంచి మిల్‌పిటాస్‌లోని ఇండియన్ కమ్యూనిటీ సెంటర్ (ఐసీసీ) వరకు ఈ కాన్వాయ్ బయల్దేరింది.

ఈ ర్యాలీకి బే ఏరియాలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 200 కార్లు 300 మంది ప్రజలు పాల్గొన్నారు.

జార్జియాలోని అట్లాంటాలో దాదాపు 150 కార్లు ర్యాలీలో పాల్గొన్నాయి.ఆస్టిన్, డల్లాస్, చికాగో, ర్యాలీ, డెట్రాయిట్ నగరాల్లోనూ ర్యాలీలు జరిగాయి.‘‘ “Modi ka guarantee, India 3rd largest economy”; “Ab ki baar 400 paar” “Modi 3.0.” అని రాసి ఉన్న ఫ్లకార్డులను వారు ప్రదర్శించారు.ర్యాలీకి హాజరైనవారు మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలకు, ముఖ్యంగా భారతదేశ అభివృద్ధికి, ప్రపంచశాంతిని పెంపొందించడంలో చేసిన కృషికి తమ కృతజ్ఞతలు తెలిపారు.

మరోవైపు .వాషింగ్టన్ డీసీ పరిసర ప్రాంతాల్లో స్థిరపడిన సిక్కు కమ్యూనిటీ సభ్యులు సైతం మోడీ మూడవసారి ప్రధానిగా ఎన్నికవ్వాలని ఆకాంక్షిస్తూ కార్ ర్యాలీ నిర్వహించారు.ఇది భారతదేశానికి మాత్రమే కాదు .ప్రపంచానికి శాంతిని తీసుకురావడానికి కూడా అవసరమని వారు వ్యాఖ్యానించారు.వీరంతా ముందుగా గురుద్వారాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అనంతరం కార్ ర్యాలీలు నిర్వహించారు.

లైంగిక శ‌క్తిని దెబ్బ‌తీసే ఈ ఆహారాల‌తో జ‌ర జాగ్ర‌త్త‌!
Advertisement

తాజా వార్తలు