నైట్ నిద్రించే ముందు ఇలా చేస్తే మార్నింగ్‌కు ముఖం మెరిసిపోతుంది!

ముఖం స‌హ‌జంగానే మెరిసిపోవాల‌ని అంద‌రూ కోరుకుంటారు.అందుకోసం ఖ‌రీదైన క్రీములు, మాయిశ్చ‌రైజ‌ర్స్, సీర‌మ్స్ ఇలా ఎన్నెన్నో కొనుగోలు చేసి వాడుతుంటారు.

అలాగే త‌ర‌చూ బ్యూటీ పార్ల‌ర్‌కు వెళ్లి వివిధ ర‌కాల‌ ఫేషియ‌ల్స్ చేయించుకుంటారు.అయితే ఎలాంటి ఖ‌ర్చు లేకుండా ఇంట్లోనే ఈ సింపుల్ రెమెడీ ద్వారా ముఖాన్ని అందంగా, మృదువుగా మెరిపిపించుకోవ‌చ్చు.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ రెమెడీ ఏంటీ.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? వంటి విష‌యాల‌పై లేట్ చేయ‌కుండా ఓ లుక్కేసేయండి.ముందుగా ఒక చిన్న క్యారెట్‌, బీట్‌రూట్ ల‌ను తీసుకుని పీల్ తొల‌గించి నీటిలో శుభ్రంగా క‌డిగి త‌డి లేకుండా ఆర‌బెట్టుకోవాలి.

ఆ త‌ర్వాత రెండిటినీ చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసి ఎండ‌లో ఎండబెట్టుకోవాలి.బాగా ఎండిన త‌ర్వాత ఈ ముక్కులు మిక్సీ జార్‌లో వేసి మెత్త‌గా పొడి చేసుకుని.

Advertisement

ఒక డ‌బ్బాలో స్టోర్ చేసుకోవాలి.ఇప్పుడు నైట్ నిద్రించే ముందు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆలోవెర జెల్‌, వ‌న్ టేబుల్ స్పూన్ క్యారెట్‌-బీట్‌రూట్ పౌడ‌ర్‌, మూడు చుక్క‌లు జోజోబా ఆయిల్ వేసుకుని అన్ని క‌లిసేలా మిక్స్ చేసుకోవాలి.

ఆపై ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసుకుని ఆరిన త‌ర్వాత నిద్రించాలి.ఉద‌యాన్నే నార్మ‌ల్ వాట‌ర్‌తో ఫేస్‌ను శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

ఈ న్యాచుర‌ల్ అండ్ సింపుల్ ఫేస్ మాస్క్‌ను ప్ర‌తి రోజు వేసుకుంటే మార్నింగ్‌కు ముఖం గ్లోయింగ్‌గా మెరిసిపోతుంది.చ‌ర్మంపై ఏమైనా మ‌చ్చ‌లు, మొటిమ‌లు ఉన్నా త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.స్కిన్ టోన్ పెంచుకునేందుకు కొంద‌రు ఏవేవో క్రీములు యూజ్ చేస్తుంటారు.

కానీ, క్రీముల‌ను ప‌క్క‌న పెట్టి పైన చెప్పిన ఫేస్ మాస్క్‌ను రోజూ వేసుకుంటే.చ‌ర్మ ఛాయ అద్భుతంగా పెరుగుతుంది.

మహేష్ తో మల్టీస్టారర్ పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు.. మేమిద్దరం క్లాస్ మేట్స్ అంటూ?
మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?

కాబ‌ట్టి, త‌ప్ప‌కుండా ట్రై చేయండి.

Advertisement

తాజా వార్తలు