సినిమా విడుదలని నిర్ణయిస్తున్న ఓటిటి సంస్థలు.. గతి తప్పితే కష్టమే !

తెలుగు సినిమా స్థాయి నేడు దిగాంతాలకు చేరింది.దర్శక ధీరుడు ఎప్పుడైతే బాహుబలి అనే కళాఖండాన్ని తీశాడో, అప్పటినుండి తెలుగు సినిమా గతి మారిపోయిందని చెప్పుకోవాలి.

ఈ క్రమంలో టాలీవుడ్ లో తెరకెక్కుతున్న పెద్ద సినిమాలు దాదాపుగా పాన్ ఇండియా( Pan India ) స్థాయిలోనే రూపొందుతుండడం విశేషం.మరోవైపు ఇప్పుడు ఓటిటీల మార్కెట్ అదనంగా లభించడంతో మంచి స్పీడ్ మీద ఫిలిం మేకర్స్ సినిమాలు తీస్తున్నారు.

అయితే ఇక్కడే సినిమా లెక్కలు తప్పినట్టు గుసగుసలు వినబడుతున్నాయి.

అవును, ఒకప్పుడు సినిమాకి సాటిలైట్ రేట్స్, థియేటర్ రేట్స్ తప్పితే అదనంగా మరేవి ఉండేవి కాదు.అయితే ఇప్పుడు అదనంగా ఓటీటీ( OTT ) సంస్థలు వ్యాపారం మొదలైంది.సదరు సినిమాలను పెద్ద మొత్తంలో కొనడానికి రెడీ కావడంతో, చిత్ర నిర్మాతలు( Producers ) ఎక్కువగా ఓటీటీ ప్లాట్ఫామ్స్ పైనే ఎక్కువగా ఆధారపడుతున్నట్టు కనబడుతోంది.

Advertisement

ఈ క్రమంలోనే ఆయా ఓటీటీ సంస్థలు ఇప్పుడు సినిమా రిలీజుని కూడా శాసిస్తున్నట్టు కనబడుతోంది.

అంటే ఇక్కడ ఓటిటి సినిమా రిలీజ్ డేట్ ని బట్టి, పాన్ ఇండియా సినిమాల రిలీజ్ డేట్స్ ని అడ్జస్ట్ చేస్తున్నట్టు కనబడుతోంది.ఇకపోతే తెలుగు సినిమాలో దేశవ్యాప్తంగా మార్కెట్ సంపాదించడంతో, పలు ఓటీటి సంస్థలు కూడా టాలీవుడ్ సినిమాలకు( Tollywood Movies ) అగ్ర తాంబూలం ఇస్తున్నాయి.సినిమా సెక్స్ మీద ఉన్నప్పుడే బిజినెస్ జరిగిపోతోంది.

ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Icon Star Allu Arjun ) నటించిన పుష్ప పార్ట్ 2( Pushpa 2 ) సినిమా ఒక రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుందని మీకు తెలుసా? దాదాపు 1000 కోట్లకు పైగా బిజినెస్ జరుపుకొని ప్రస్తుతం టాలీవుడ్ లోనే నెంబర్ వన్ సినిమాగా టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.ఇందులో అత్యధికంగా ఓటీపీ సంస్థల ఎక్కువగా చెల్లింపులు జరిపినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

దాంతో అల్లు వారి అభిమానులు దీపావళికి ముందే పండగ చేసుకున్నారు.ఇక దీపావళి పండగ సందర్భంగా రిలీజ్ అయిన మూడు సినిమాలు.

గేమ్ ఛేంజర్ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో అతనేనా.. అందుకే రిజెక్ట్ చేశారా?
ఈ స్టార్ డైరెక్టర్లు ఇప్పటికైన మారాల్సిన అవసరం ఉందా..?

లక్కీ భాస్కర్, అమరన్, క సినిమాలను ఓటీటీ సంస్థలు భారీ మొత్తంలో కొనుగోలు చేసినట్టు సమాచారం.

Advertisement

తాజా వార్తలు