ఓరి దేవుడా ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్ గా హాజరుకానున్న స్టార్ హీరో..?

వెళ్ళిపోమాకే అనే సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన విశ్వక్ సేన్ అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమాతో ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా దగ్గరయ్యాడు .

ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి హిట్ అందుకొని బాక్సాఫీస్ వద్ద వసూళ్లు సాధించింది.

ఈ సినిమా విజయం సాధించటంతో విశ్వక్ వరుస సినిమాలలో నటించే అవకాశాలు అందుకున్నాడు.ఈ క్రమంలో ప్రస్తుతం విశ్వక్ దాదాపు అరడజనకు పైగా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.

క్రమంలో విశ్వక్ నటించిన "ఓరి దేవుడా" అనే సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని అక్టోబర్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకి రానుంది.ఈ క్రమంలో సినిమా యూనిట్ చిత్ర ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది.

ఈ క్రమంలో ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు.అంతేకాకుండా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆదివారం రాజమండ్రిలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించడానికి సిద్ధం చేశారు.

Advertisement
Oridevuda Film Pre Release Event Guest Details, Oridevuda Film, Tollywood, Ashok

ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

Oridevuda Film Pre Release Event Guest Details, Oridevuda Film, Tollywood, Ashok

ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, ట్రైలర్ పాటలు సినిమా మీద ప్రేక్షకులలో పాజిటివ్ ఒపీనియన్ క్రియేట్ చేశాయి.అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమా ద్వారా హిట్ అందుకున్న విశ్వక్ ఓరి దేవుడా సినిమా హిట్ అవుతుందని చాలా నమ్మకంగా ఉన్నాడు.ఇక ఈ సినిమాలో విశ్వక్ సేన్ కి జోడీగా మిథిలా పాల్కర్‌ నటిస్తుంది.

రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని ఓమై కడువలే అనే తమిళ్ చిత్రానికి రీమేక్‌గా అశ్వత్ మరిముత్తు తెరకెక్కిస్తున్నాడు.ఇక ఈ సినిమా లో వెంకటేష్ కీలకపాత్ర పోషిస్తున్నాడు.

భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?
Advertisement

తాజా వార్తలు