సర్ ప్రైజ్ ఇచ్చిన వెంకటేష్‌.. ఓరి దేవుడా వచ్చేది ఎప్పుడంటే!

విశ్వక్ సేన్‌ హీరోగా వెంకటేష్ కీలక పాత్రలో తెరకెక్కిన ఓరి దేవుడా చిత్రం విడుదలకు సిద్ధమైంది.

దిల్ రాజు సమర్పిస్తున్న ఈ సినిమా పై తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

సూపర్ హిట్ తమిళ సినిమా కు రీమేక్ అయిన ఈ సినిమా లో వెంకటేష్ గెస్ట్ రోల్‌ కి మించిన పాత్ర ను చేస్తున్నట్లుగా మొదటి నుండే చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతూ వస్తున్నారు.ఎట్టకేలకు సినిమా కు సంబంధించిన అప్డేట్ యూనిట్ సభ్యులు ఇచ్చారు.

ఈ సినిమా ను దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా అధికారికం గా ప్రకటించారు.అక్టోబర్ 21 వ తారీఖున తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ను భారీ ఎత్తున విడుదల చేయబోతున్నట్లుగా తాజా వీడియోలో పేర్కొన్నారు.

వెంకటేష్ మరియు విశ్వక్‌ సేన్ కలిసి నటించడం ఇదే ప్రధమం.తప్పకుండా వీరిద్దరి కాంబినేషన్ కి మంచి సక్సెస్ దక్కుతుందని అనే నమ్మకం వ్యక్తం అవుతుంది.

Advertisement

ప్రస్తుతం సినిమా కు సంబంధించిన చివరి దశ కార్యక్రమాలు జరుగుతున్నాయి.దీపావళికి పెద్ద సినిమా లు ఏమీ లేకపోవడంతో ఈ సినిమా ను హడావుడిగా విడుదల చేయాలనే ఉద్దేశం తో దిల్ రాజు డేట్ కన్ఫర్మ్ చేశాడు.వెంకటేష్ లుక్ చాలా విభిన్నంగా ఉండడం తో పాటు విశ్వక్సేన్ తప్పకుండా ఆకట్టుకుంటాడు అన్నట్లుగా కనిపిస్తున్నాడు.

మొత్తానికి సినిమా ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ గా దీపావళికి ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తుంది అంటూ సినీ విశ్లేషకులు మరియు ప్రేక్షకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.వెంకటేష్ ఈ మధ్య కాలంలో హీరోగా వరుసగా సినిమాలు చేయడం మానేసినట్లుగా అనిపిస్తుంది.

ఇలా గెస్ట్ రోల్స్ మాత్రమే చేస్తున్నాడు.హిందీ లో కూడా ఈయన ఒక సినిమా లో గెస్ట్ రోల్ చేసిన విషయం తెలిసిందే.

ఆ సినిమా సల్మాన్ ఖాన్ నటించిన అనే విషయం కూడా తెలిసిందే.మొత్తానికి వెంకటేష్ హీరో గానో గెస్ట్ గానో ఏదోలా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

ఈ రాశుల వారు పక్కవారి ఐడియాలను కాపీ చేస్తారు..!

అదే మాకు చాలు అన్నట్లు అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement