వైరల్: మరో వెరైటీ ఫుడ్ అరాచకం... ఇదేం కాంబో అంటూ జనాలు గగ్గోలు!

సోషల్ మీడియా( Social media ) అందుబాటులోకి వచ్చాక దేశం నలుమూలలా గల్లీగల్లీల్లో నడుస్తున్న తినుబండారాల తాలూక వీడియోలను మనం చూడగలుగుతున్నాం.

అందులో కొన్ని పర్వాలేదనిపించినా, మరికొన్ని చాలా చిత్ర విచిత్రంగా అనిపిస్తూ ఉంటాయి.

కొన్ని ఇదెక్కడి ఫుడ్ రా బాబు అనిపిస్తే, మరికొన్ని రెసిపీలు మాత్రం అరాచకంరా బాబు అని ఇబ్బంది పెడుతూ ఉంటాయి.వాటిని చూసిన నెటిజనం ఇలాంటి ఆహారం తిన్నవాళ్ళు కూడా వుంటారా ఈ భూమ్మీద అని కామెంట్స్ చేస్తూ వుంటారు.

తాజాగా అలాంటి రకానికి చెందిన వీడియో ఒకటి ఇంటర్‌నెట్‌లో తెగ హల్ చల్ చేస్తోంది.

అవును, విచిత్రమైన ఫుడ్ కాంబినేషన్‌తో కూడిన వీడియోలు సోషల్ మీడియా వేదికగా ప్రస్తుతం సందడి చేస్తుండడం అందరికీ తెలిసినదే.సాధారణంగా మనిషి ఆహార ప్రియుడు.అందుకే సోషల్ మీడియా వేదికగా అనేకమంది నేడు ఫుడ్ కి సంబందించిన వ్లాగ్స్ చేస్తూ వుంటారు.

Advertisement

అయితే ఇక్కడ అన్ని ఫుడ్ కాంబోలు నెటిజన్లను ఆకట్టుకోలేవు.చిత్ర విచిత్ర ఫుడ్ కాంబినేషన్‌లపై నెటిజన్లు పెదవివిరుస్తుంటారు.

లేటెస్ట్‌గా ఓరియో ఫ్రైడ్ రైస్( Oreo Fried Rice ) వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.కారణం ఆ కాంబినేషన్ బాగుండడం కాదు.

అరాచకంగా ఉండడం.

అవును, కొంతమంది ఔత్సాహికులు స్వీట్‌, సేవరీ టేస్ట్ యమ్మీ ఇష్టపడినా.మరికొందరు మాత్రం ఇదేం కాంబినేషన్ అంటూ పెదవి విరుస్తున్న పరిస్థితి.ఇన్‌స్టాగ్రాం మీమ్ పేజ్ తొలుత ఈ వీడియోను షేర్ చేయగా ఈ యూనిక్ డిష్ ప్రిపరేషన్ క్లిప్ ప్రస్తుతం నెట్టింట్లో రచ్చ రచ్చ చేస్తోంది.

Fatboss : Sécurité Des Joueurs Et Jeu Responsable

ఈ వీడియోని ఒక్కసారి పరిశీలిస్తే.ముందుగా ఓ వ్యక్తి పాన్‌లో నూనెను వేడి చేస్తూ అందులో పలు ఓరియో బిస్కెట్ల( Oreo biscuits )ను ముందుగా వేసాడు.

Advertisement

తరువాత బిస్కెట్లు మెత్తగా అయ్యేందుకు కుక్ హాట్ ఆయిల్‌లో చాక్లెట్ పేస్ట్‌ను మిక్స్ చేయడం ఇక్కడ మనకు కనిపిస్తుంది.మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి మిత్రులారా!.

" autoplay>

తాజా వార్తలు