గులాబీ కండువా కప్పేసుకున్న కేసీఆర్ ప్రత్యర్థి !

టీఆర్ఎస్ పార్టీ వేస్తున్న ఒక్కో ఎత్తుగడ సత్పలితాలు ఇస్తున్నాయి.తమకు ప్రత్యర్థులే లేకుండా చేసుకోవాలని చూస్తున్న కారు పార్టీ .

తమ ప్రత్యర్థులపై సామ, దాన, దండోపాయాలను ఉపయోగించి మరీ .తమ ప్రత్యర్థులందరికి గులాబీ కండువా కప్పేస్తోంది.ఈ క్రమంలోనే.

గజ్వేల్ ప్రతాప్ రెడ్డి అలియాస్ వంటేరు ప్రతాప్‌రెడ్డి టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వంటేరు ప్రతాప్‌రెడ్డి గజ్వేల్ నియోజకవర్గం నుంచి కేసీఆర్‌పై పోటీ చేసి ఓడిపోయారు.

కేసీఆర్ 56 వేల ఓట్ల మెజార్టీతో వంటేరుపై విజయం సాధించారు.2014 ఎన్నికల్లోనూ కేసీఆర్ చేతిలో ఓటమి పాలయ్యారు.ఎన్నికల సమయంలో కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన ఇప్పుడు అవన్నీ మర్చిపోయి టీఆర్ఎస్‌లో చేరారు.

Advertisement

తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్‌ సమక్షంలో కారెక్కారు.వంటేరు ప్రతాప్‌రెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

Advertisement

తాజా వార్తలు