1వ తేదీ నుంచి టీచ‌ర్స్ కు ఆన్‌లైన్ అటెండెన్స్

టీచ‌ర్స్ సెప్టెంబ‌ర్ 1 నుంచి స్కూల్ అటెండెన్స్ యాప్ ద్వారా హాజ‌రు న‌మోదు చేయాల‌ని ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఇక నుంచి మాన్యువ‌ల్ అటెండెన్స్ ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోబోమ‌ని స్ప‌ష్టం చేసింది.

ఇందులో నుండి ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠ‌శాల‌ల టీచ‌ర్ల‌కు యాప్ నుంచి మిన‌హాయింపు ఇచ్చింది.ఆండ్రాయిడ్ ఫోన్లు లేనివారు ఇతర సిబ్బంది ఫోన్లు వినియోగించుకోవాలని సూచించింది.

రేపటిలోగా టీచర్లు, బోధనేతర సిబ్బంది రిజిస్ట్రేషన్లు పూర్తి కావాలని ఆదేశించింది.రాష్ట్రస్థాయి, జోనల్, రీజినల్, ఎంఈవో కార్యాలయాలు కూడా యాప్ వాడాలని ప్ర‌భుత్వం సూచించింది.

Hair Fall : హెయిర్ ఫాల్ కి బెస్ట్ సొల్యూషన్.. ఒక్కసారి దీన్ని ట్రై చేశారంటే జుట్టు ఊడమన్నా ఊడదు!
Advertisement

తాజా వార్తలు