అత్యంత తక్కువ ధరలలో మార్కెట్లోకి OnePlus Tablet వచ్చేస్తోంది!

అవును, ఇపుడు మీకెంతో ఇష్టమైన స్మార్ట్‌ఫోన్‍ కంపెనీ వన్‍ప్లస్ బ్రాండ్ నుండి మీకు ఇష్టమైన ట్యాబ్లెట్స్ మార్కెట్లోకి రాబోతున్నాయి.

కాగా Tabs విభాగంలో ప్రవేశపెట్టడం ఈ కంపెనీకి తొలిసారి కావడం విశేషం.

ఈ ఏడాదే ట్యాబ్‍ను విడుదల చేయనుంది.వన్‍ప్లస్ ప్యాడ్‍ పేరుతో మార్కెట్లోకి రాబోతున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రైవేట్ టెస్టింగ్ ఇండియాలో మొదలైనట్టు తాజాగా సమాచారం బయటికి పొక్కింది.Aries కోడ్‍నేమ్ పేరుతో ఈ ట్యాబ్ టెస్టింగ్ జరుగుతోందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఈ ఏడాది మధ్యలో వన్‍ప్లస్ ట్యాబ్లెట్ లాంచ్ అయ్యే అవకాశం ఉందని టాక్ వినబడుతోంది.వన్‍ప్లస్ 11 ఆర్ మొబైల్‍తో పాటు వన్‍ప్లస్ ఈ ట్యాబ్ విడుదవుతుందని భోగట్టా.

Advertisement

ఇండియాలో తన తొలి ట్యాబ్‍ను బడ్జెట్ రేంజ్‍లో లాంచ్ చేయాలని వన్‍ప్లస్ ఆలోచన చేస్తోంది.

కాగా దీని ధర రూ.20వేల రేంజ్‍లోనే ఉంటుందని అంటున్నారు.ఈ క్రమంలో ఒప్పో ప్యాడ్ ఎయిర్, రియల్‍మీ ప్యాడ్ ఎక్స్, షావోమీ ప్యాడ్ 5లకు పోటీ కానుంది.

కాగా, పేరెంట్ కంపెనీకు ఒప్పోకు చెందిన ప్యాడ్ ఎక్స్ కు రీబ్రాండెడ్ వెర్షన్‍గా వన్‍ప్లస్ ఈ ట్యాబ్‍ను తీసుకొస్తుందన్న అంచనాలు కూడా ఉన్నాయి.

స్నాప్‍డ్రాగన్ 865 ప్రాసెసర్‌, 2K రెజల్యూషన్ విత్ 10.36 ఇంచుల IPS LCD డిస్‍ప్లే, 100ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో వన్‍ప్లస్ ట్యాబ్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు.అయితే ట్యాబ్ గురించి వన్‍ప్లస్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం విశేషం.

త్వరలో నన్ను నేను ప్రూవ్ చేసుకుంటా.. ఆ వివాదంపై జానీ మాస్టర్ క్లారిటీ ఇదే!
చూపు లేకపోయినా 4 కిలోమీటర్లు నడిచి గ్రూప్4 జాబ్.. మానస సక్సెస్ కు వావ్ అనాల్సిందే!

మార్చి నాటికి దీనిపై స్పష్టత వచ్చే అవకాశం కలదు.వన్‍ప్లస్ ఇటీవల, వన్‍ప్లస్ 11 5జీ (OnePlus 11 5G) ఫ్లాగ్‍షిప్ ఫోన్‍ను చైనాలో లాంచ్ చేసిన సంగతి విదితమే.స్నాప్‍డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్, 2K రెజల్యూషన్ ఎల్‍టీపీవో 3.0 డిస్‍ప్లే, ఫ్లాగ్‍షిప్ కెమెరాతో ఈ మొబైల్ వస్తోంది.

Advertisement

తాజా వార్తలు