రెండు ఫ్లాప్‌ అయినా మళ్లీ ఆమెతోనే వెంకీమామ రొమాన్స్‌

వెంకటేష్‌ హీరోగా తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన అసురన్‌ చిత్రాన్ని రీమేక్‌ చేయబోతున్నారు.

సురేష్‌ బాబు మరియు కళై పులి థాను నిర్మాతలుగా ఈ చిత్రం రూపొందబోతుంది.

రికార్డు స్థాయిలో అసురన్‌ వసూళ్లు సాధిస్తున్న నేపథ్యంలో వెంకీ ఆ రీమేక్‌ చేస్తుండటంతో అంతా రీమేక్‌పై దృష్టి పెడుతున్నారు.ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అంటూ అప్పుడే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది.

One More Time Shriya Act In Venkatesh

ఈ రీమేక్‌కు ఓంకార్‌ దర్శకత్వం వహిస్తాడంటూ వార్తలు వస్తున్నాయి.త్వరలోనే దర్శకుడు ఎవరు అనే విషయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.ఇదే సమయంలో హీరోయిన్‌ విషయమై ప్రచారం జరుగుతోంది.

Advertisement
One More Time Shriya Act In Venkatesh-రెండు ఫ్లాప్‌ అ

ఈ చిత్రంలో శ్రియను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయట.మంజు వారియర్‌ హీరోయిన్‌గా అసురన్‌ చిత్రంలో నటించింది.

ఇప్పుడు ఆమె పాత్రను శ్రియతో చేయించేందుకు చర్చలు జరుగుతున్నయి.శ్రియ తెలుగులో మంచి ఫేమ్‌ ఉన్న నటి కనుక ఆమెతో చేయాలని నిర్ణయించుకున్నారు.

One More Time Shriya Act In Venkatesh

గతంలో వెంకటేష్‌ హీరోగా నటించిన సుభాష్‌ చంద్రబోస్‌ మరియు గోపాల గోపాల చిత్రాల్లో శ్రియ హీరోయిన్‌గా నటించింది.అయితే ఆ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్‌ వద్ద తీవ్రంగా నిరాశ పర్చాయి.అందుకే ఈ చిత్రంలో శ్రియను తీసుకోవడంను కొందరు వెంకీ అభిమానులు తప్పుబడుతున్నారు.

ఎంతో మంది సీనియర్‌ హీరోయిన్స్‌ ఉండగా ఆమెనే ఎందుకు అంటున్నారు.మంజు వారియర్‌ హీరోయిన్‌గా తీసుకున్నా బాగానే ఉంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ అలవాటు మానుకోకపోతే.. ఈ ఐదు సైడ్ ఎఫెక్ట్స్ పక్కా..

మరి అసలు ఈ చిత్రంకు హీరోయిన్‌గా ఎవరిని తీసుకుంటారు అనేది చూడాలి.

Advertisement

తాజా వార్తలు