దేవర సీక్వెల్ లో మరో బాలీవుడ్ స్టార్ హీరో.. వైరల్ అవుతున్న వార్త నమ్మేలా ఉందా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన దేవర సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా హిట్ గా నిలిచినా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే విషయంలో ఈ సినిమా ఫెయిల్ అయింది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Young Tiger Jr.

NTR)కూడా ఈ సినిమా రిజల్టు విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారని సోషల్ మీడియా వేదికగా వార్తలు తెగ వైరల్ అయ్యాయి.ఈ సినిమాలో జాన్వి కపూర్(Janhvi Kapoor) హీరోయిన్గా నటించగా ఆమె పాత్రకి కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రాధాన్యత లేదనే సంగతి తెలిసిందే.

దేవర(Devara) ఫలితం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో దేవర సీక్వెల్ పై ప్రేక్షకుల్లో ఎన్నో అనుమానాలు నెలకొన్నాయి.

One More Bollywood Hero Playing Key Role In Devara Sequel Details Inside Goes Vi

అయితే కొరటాల శివ (Koratala Shiva)మాత్రం ప్రస్తుతం దేవర సీక్వెల్ స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నారని ఈ ఏడాది చివరి నాటికి దేవర సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.దేవర పార్ట్ వన్ లో సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan) విలన్ కాగా దేవర సీక్వెల్ లో మాత్రం బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నారని వార్తలు వినిపించాయి.ఇప్పటికే ఎన్టీఆర్ బాబి (NTR Bobby)డియోల్ కాంబినేషన్లో కొన్ని సన్నివేశాల షూట్ పూర్తయిందని వార్తలు వినిపించాయి.

Advertisement
One More Bollywood Hero Playing Key Role In Devara Sequel Details Inside Goes Vi

అయితే ఈ సినిమాలో మరో కీలక పాత్రలో రణవీర్ సింగ్ నటిస్తున్నారని ప్రచారం జరుగుతుంది.దర్శకుడు కొరటాల శివ ప్రధానంగా బాలీవుడ్ ఇండస్ట్రీని టార్గెట్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.

One More Bollywood Hero Playing Key Role In Devara Sequel Details Inside Goes Vi

అయితే వైరల్ అవుతున్న వార్తల్లో నిజానిజాలు తెలియాలంటే మాత్రం మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సిందేనని చెప్పవచ్చు.మరోవైపు దేవర మూవీ శాటిలైట్ రైట్స్ ఇప్పటికీ అమ్ముడవలేదు.ఈ సినిమా బుల్లితెరపై ఎప్పుడు ప్రసారం అవుతుందా అని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు