ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ దేవాలయంలో సాధారణ భక్తులకే ఎక్కువ ప్రాధాన్యత..

జనవరి 2వ తేదీన ముక్కోటి ఏకాదశి సందర్భంగా సాధారణ భక్తులకు దర్శన అవకాశం కల్పించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తామని శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో దేవాలయ శాఖ మంత్రి పీకే శేఖర్ బాబు వెల్లడించారు.

శ్రీరంగం క్షేత్రంలోని శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో జనవరి రెండో తేదీన ముక్కోటి ఏకాదశి ఎంతో వైభవంగా, ఘనంగా నిర్వహించే అవకాశం ఉంది.

శనివారం ఉదయం దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్ బాబు మాట్లాడుతూ రంగనాథ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులతో కలిసి మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ దేవాలయంలో ముక్కోటి ఏకాదశి రోజు నంబెర్మాల్ స్వర్గా ద్వారా ప్రవేశ వేడుకలకు నాలుగు వేల టికెట్లతో 300 మందికి, 700 టికెట్లతో వెయ్యి మందికి ప్రత్యేక దర్శనం కల్పిస్తామని ఈ ప్రత్యేక దర్శనం టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చని ఈ సందర్భంగా చెప్పారు.అంతేకాకుండా దేవాలయంలో జరిగే పగలపత్తు, రాపత్తు వేడుకలకు

సుమారు 17 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని దేవాలయ కార్య నిర్వహణ అధికారులు అంచనా వేస్తున్నారు.ముక్కోటి ఏకాదశికి సుమారు రెండు లక్షల మందికి పైగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది.వీరికి మూడు వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేపడుతున్నామని కూడా ఈ సందర్భంగా చెప్పారు.

అంతేకాకుండా 10 మంది వైద్యులు, నర్సులు, ఆరుగురు కాంపౌండర్లు భక్తులకు వైద్య సేవలు అందించడానికి 24 గంటల పాటు అందుబాటులో ఉంటారని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.దేవాలయంలోని నాలుగు ప్రవేశ దారుల ద్వారాల వద్ద సంచార వైద్య బృందాలు, మూడు అంబులెన్సులు కూడా ఉంటాయని చెప్పారు.

Advertisement

భక్తులకు 12 చోట్ల శుద్ధికరించిన మంచి నీటి కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు.

టాలీవుడ్ హీరోలను ట్రాప్ చేస్తున్న కోలీవుడ్ డైరెక్టర్స్ ?
Advertisement

తాజా వార్తలు