అక్కినేని నాగార్జున( Nagarjuna ) ఇటీవల నటించిన సినిమాలు ఏవి పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.గతంలో ఈయన బంగార్రాజు సినిమాతో హిట్ కొట్టారు.
ఈ సినిమా తర్వాత నాగార్జున పలు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెద్దగా సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయని చెప్పాలి.ఇకపోతే ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నాగార్జున నటించిన నా సామి రంగ ( Naa Samiranga ) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా సంక్రాంతి పండుగకు పర్ఫెక్ట్ సినిమా అని చెప్పాలి.
కొరియోగ్రాఫర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి విజయ్ బిన్నీ దర్శకుడుగా మారి ఈ సినిమాని తెరకెక్కించారు.ఈ సినిమాలో నాగార్జునకు జోడిగా ఆషిక రంగనాథ్ ( Ashika Ranganath ) నటించారు.ఈ సినిమాలో నాగార్జునతో పాటు అల్లరి నరేష్ ( Allari Naresh ) రాజ్ తరుణ్ ( Raj Tarun ) వంటి వారందరూ కూడా కీలక పాత్రలలో నటించారు.
ఇక ఈ సినిమా జనవరి 14వ తేదీ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇలా థియేటర్లలో పెద్ద ఎత్తున ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈ సినిమా త్వరలోనే డిజిటల్ మీడియాలో కూడా ప్రసారం కావడానికి సిద్ధమవుతోంది.ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కొనుగోలు చేశారు.ఇకపోతే తాజాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ గురించి మేకర్స్ అధికారిక ప్రకటన వెల్లడించారు.
ఈ సినిమా జనవరి 14 వ తేదీ థియేటర్లలో ప్రసారం కాగా డిజిటల్ మీడియాలో ఫిబ్రవరి 17వ తేదీ నుంచి ప్రసారం కానుందని మేకర్స్ వెల్లడించారు.ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో నాగార్జున ప్రతి సంక్రాంతికి తన సినిమా ఉంటుందని ఇటీవల ఈ సినిమా సక్సెస్ కార్యక్రమంలో తెలియజేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy