అఫిషియల్ : సంక్రాంతి రేస్ లోకి 'హనుమాన్'.. పోటీ తట్టుకుంటాడా?

మన టాలీవుడ్ నుండి రాబోతున్న బిగ్గెస్ట్ విజువల్ అండ్ గ్రాఫిక్స్ కలిగిన సినిమాల్లో హనుమాన్ ( Hanu-Man ) ఒకటి.

ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయిన విషయం తెలిసిందే.

తక్కువ బడ్జెట్ అయినప్పటికీ ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కించడంలో ఈ సినిమాను ఆదిపురుష్ తో పోల్చుతూ ప్రేక్షకులు చేసిన ట్రోలింగ్ వల్ల ఈ సినిమా మరింత హైప్ తెచ్చుకుంది.దీంతో మేకర్స్ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ( Director Prashant Varma ) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ( Hero Teja Sajja ) హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్నారు.ఈ సినిమా నుండి వచ్చిన టీజర్ రిలీజ్ తో అంచనాలు భారీగా పెంచుకోగా పాన్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అయ్యింది.అందుకే గ్రాఫిక్స్ విషయంలో ఏ చిన్న మిస్టేక్ కూడా లేకుండా ప్రశాంత్ వర్మ మరింత డిటెయిల్ గా కేర్ తీసుకుంటున్నాడు.

ఇక ఈ సినిమా యూనివర్శల్ సబ్జెక్ట్ కావడంతో పాన్ వరల్డ్( Pan World ) లెవల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.గతంలో వాయిదా పడ్డ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న తరుణంలో తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను అఫిషియల్ గా ప్రకటించారు.

Advertisement

ఈ సినిమా ఈ ఏడాది మొత్తమే లేకుండా వచ్చే ఏడాదికి షిఫ్ట్ అయ్యింది.2024 జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్టు పోస్టర్ రిలీజ్ చేస్తూ క్లారిటీ ఇచ్చేసారు.మరి ఈసారి సంక్రాంతి ( Sankranthi 2024 ) రేసులో స్టార్ హీరోల సినిమాలు ఉండడం వల్ల ఈ ప్రాజెక్ట్ ఎలా తట్టుకుని నిలబడుతుందో వేచి చూడాలి.

మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?
Advertisement

తాజా వార్తలు