ప్రమాద ఘంటికలు మోగిస్తున్న ఊబకాయం....2035 నాటికి సగం కి పైగా వారే

అధిక బరువు ఇప్పుడు ప్రపంచాన్ని వేధిస్తున్న అతిపెద్ద సమస్య ఇంతకు ముందు వరకు కేవలం అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే కనిపించే ఈ సమస్య ఇప్పుడు మనదేశంలోనూ ఆందోళన కలిగిస్తుంది.

దీనికి కారణం మన జీవన శైలిలో వచ్చిన మార్పులు మన విద్యా విధానంలో పాటిస్తున్న పద్ధతులే అని తెలుస్తుంది ప్రతి 10 మందిలో ఇప్పుడు ముగ్గురు ఊబకాయలు కనిపిస్తున్నారు.

వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్ తాజాగా విడుదల చేసిన ఓ నివేదిక లో ఆందోళన కలిగించే విషయాలను వెల్లడించింది.అందులో ముఖ్యం గా 2035 వ సంవత్సరం నాటికి ప్రపంచ జనాభా లో సగం మందికి పైగా ఈ ఒబేసిటీ బారిన పడతారని అంచనా వేసింది.

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా ప్రజలు ఈ సమస్య తో బాధపడుతున్నారని ,తక్షణమే సరైన చర్యలు తీసుకోకపోతే తీవ్రత దుష్పరిణామాలు ఉంటాయని తెలియచేసింది.

బాలబాలికల్లో ఊబకయం రేటు పెరుగుదల 2020 తో పోలిస్తే 2035 నాటికి రెట్టింపు అవుతుందని WFO తన నివేదికలో వెల్లడించింది.దీనివల్ల వ్యక్తిగత ఆరోగ్య సమస్యలే కాక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద 4 ట్రిలియన్ డాలర్ల కు పైగా ప్రభావం పడనుందని పేర్కొంది.బాడీ మాస్ ఇండెక్స్ (BMI) ను ఆధారం చేసుకుని ఈ నివేదికను రూపొందించినట్లు వెల్లడించింది.

Advertisement

అతిగా జంక్ ఫుడ్ తీసుకోవడం,రోజు వారి సాధారణ వ్యాయామం కూడా చేయకపోవడం,శారీరక శ్రమ లేకపోవడం,తీసుకునే క్యాలరీ ల పై అవగాహన లేకపోవడం ,అతిగా ప్రొసెస్ చేసిన ఆహారం తీసుకోవడం వంటి అంశాలు ఈ సమస్యకు కారణాల అవుతున్నాయి.

ప్రభుత్వాలు కూడా స్కూళ్లలో ఆట స్థలాలు ఏర్పాట్లపై దృష్టి పెట్టాలని ప్రైవేటు స్కూళ్లకు గ్రౌండ్లు లేకపోతే అనుమతులు ఇవ్వకూడదని ,ప్రజలు కూడా జీవనశైలిలో మార్పులు పట్ల అవగాహన పెంచుకోవాలని లేకపోతే రానున్న రోజుల్లో తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ నివేదిక స్పష్టం చేసింది.మరి ఇప్పటికైనా ప్రభుత్వాల్లో చలనం వస్తుందో లేదో చూడాలి.

Advertisement

తాజా వార్తలు