ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే ఏపీకి మొదటి ర్యాంక్ వచ్చిందని చెప్పుకొంటున్న సీఎం జగన్ రెడ్డి రాషా్టన్రికి వచ్చిన పరిశ్రమలు, పెట్టుబడులు ఎన్నో చెప్పగలరా? ఒక పక్కన ఏపీలో పారిశ్రామిక, సేవారంగాలు పూర్తిగా పడకేశాయని, పూర్తి తిరోగమనంలో ఉన్నాయని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ రాష్ట్ర దయనీయ దుస్థితిపై వాస్తవాలను బయటపెట్టింది .
క్రిసిల్ నివేదికపై ప్రభుత్వం నోరు మెదపకుండా తాను సొంతంగా రూపొందించుకున్న లెక్కలను ప్రభుత్వం గొప్పగా సొంత మీడియాలో ఊదరగొడుతున్నది.
ఏపీసీఆర్డీఏ బాండ్ల రేటింగ్‌ను తగ్గిస్తూ ఇచ్చిన నివేదికలో ఈ వివరాలను స్పష్టంగా పొందుపరిచింది.గత మూడున్నరేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన ప్రగతి సాధించిందని, జగన్ సొంత మీడియా ఘనంగా చెప్పుకుంటున్న గొప్పలు అన్ని,ఇన్ని కావు.
అంతే కాదు రాష్ట్ర స్థూల ఉత్పత్తి జీఎస్డీపీలో పొరుగునే ఉన్న కర్ణాటక, తమిళనాడు తెలంగాణను మించి వృద్ధిరేటు నమోదైందని చెప్పుకోవడం వింతగా వుంది.రంగాలవారీగా వృద్ధి పేరిట ప్రభుత్వం చెబుతున్న లెక్కల్లో నిజమెంత? సొంత డప్పు కొట్టు కొంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు.నిజాలను మార్చలేం కానీ అంకెలను ఎలాగైనా మలచవచ్చని జగన్ ప్రభుత్వ గొప్పల అంకెలు నిరూపిస్తున్నాయి.
జగన్ పాలనలో అబద్దాల దుకాణం కళ,కళ లాడిపోతుంది.రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు బారులు తీరుతున్నారని ప్రభుత్వం చెప్పుకొంటున్న గొప్పల్లో నిజమెంతో ప్రజలకు తెలియాల్సి వుంది.గడచిన మూడున్నరేళ్లుగా రాష్ట్రానికి వచ్చిన విదేశీ పెట్టుబడులు పరిశీలిస్తే కేంద్ర పారిశ్రామిక అంతర్గత వాణిజ్య పోత్సాహక విభాగం డీ పీ ఐఐటీ తన వెబ్ సైట్‌లో పొందుపరిచిన వివరాలు ప్రకారం 2019- అక్టోబర్ నుంచి 2022 జూన్ వరకు రాషా్టన్రికి వచ్చిన విదేశీ పెట్టుబడులు మొత్తం రూ 4,05.89 కోట్లు కాగా, ఇదే సమయంలో దేశవ్యాప్తంగా రూ 11,79,138 లక్షల కోట్లు పెట్టుబడులు రాగా అందులో ఆంధ్రప్రదేశ్‌కి వచ్చిన పెట్టుబడులు కేవలం 0.34.64 శాతం మాత్రమే.డీపీ ఐఐ టీ నివేదిక ప్రకారం దేశంలో 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వచ్చిన విదేశీ పెట్టుబడుల వివరాలను పరిశీలిస్తే రూ 3,29 లక్షల కోట్లతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా,రూ 2,73 లక్షల కోట్లతో కర్ణాటక రెండవ స్థానంలో,రూ 2,27లక్షల కోట్లతో గుజరాత్ మూడో స్థానంలో,రూ 1,48 లక్షల కోట్లతో ఢిల్లీ నాలుగో స్థానంలో నిలిచాయి.
ఎడారి ప్రాంతం రాజస్థాన్,చిన్న రాష్ట్రం అయిన జార్ఖండ్ కూడా విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ కన్నా ముందు వరుసలో వున్నాయి.తెలంగాణా రూ 29,690 కోట్లతో ఎడవ స్థానంలో నిలవగా కేవలం రూ 4,056.89 కోట్లతో ఆంధ్రప్రదేశ్ 14వ స్థానంలో నిలిచింది.దేశ వ్యాప్తంగా పెట్టుబడులు రాకపోతే అందరితో పాటు మనం అనుకొంటాము.
కానీ మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో లక్షల కోట్లతో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తుంటే, ఆంధ్రప్రదేశ్ వైపు మాత్రం ఒక్కరుకూడా తిరిగి చూడటంలేదు.వాస్తవాలు ఈ విధంగా ఉంటే వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 97 భారీ మెగా పరిశ్రమలు ఏర్పాటు ద్వారా రూ 39,517 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, పారిశ్రామిక రంగం పరుగులు తీస్తుందని, పారిశ్రామిక వేత్తలు బారులు తీరుతున్నారని సొంత మీడియాలో ఊదర గొడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారు.
ఈ మూడున్నరేళ్లలో ఒక్క పరిశ్రమ అయినా రాలేదు రాష్ట్రానికి.గత ప్రభుత్వంలో పురుడు పోసుకున్న వాటికి రిబ్బన్లు కత్తిరించడం మినహా ఒక పరిశ్రమను తీసుకు రాలేకపోయారు .అంతేకాదు అప్పులు దండిగా తెచ్చుకునేందుకు అడ్డగోలుగా జీఎస్డీపీని పెంచేసి దానినే అద్భుతమైన అభివృద్ధిగా గొప్పలు చెప్పుకొంటున్నారు.రిజర్వు బ్యాంకే తన నివేదికలో దీనిని ధ్రువీకరించినట్లుగా సొంత మీడియాలో కధనాలు రాస్తున్నారు.
కానీ రిజర్వు బ్యాంకుకు రాష్ట్ర ప్రభుత్వాల వృద్ధిరేటును, గణాంకాలను నిర్ధారించే స్వతంత్ర వ్యవస్థ ఏదీ లేదన్నవిషయం ప్రజలు అర్ధం చేసుకోవాలి.విని మోస పొయ్యేవాళ్ళు ఉన్నంతకాలం జగన్ రెడ్డి ఇలాంటి మాయలుచేస్తూనే ఉంటారు, వృద్ధిరేటు విషయంలో అబద్ధాలు చెప్పడం రాకనే కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ వంటి రాషా్టల్రు ఆంద్రప్రదేశ్ కంటే వెనుకబడి పోయి ఉన్నాయి అని చెప్పాలి.జీఎస్ డిపిలో 3.5 శాతం అప్పులు తెచ్చుకునేందుకు కేంద్రం అనుమతిస్తుంది.తర్వాత వివిధ ప్రాతిపదికల ఆధారంగా అదనంగా అప్ప్పులు తెచ్చుకునేందుకు జీ ఎస్ డిపి ఎక్కువగా చూపిస్తున్నారు.
ఆ తప్పుడు లెక్కలనే ఎక్కువ అప్పుల కోసం కేంద్రానికి, కాగ్‌ను, ఆర్బీఐకి పంపిస్తుంది ప్రభుత్వం.లెక్కల వివరాలు కాగ్, ఆర్బీఐ తనిఖీ చేయరు.వాస్తవాలు పరిశీలిస్తే అనేక రంగాలలో అభివృద్ధి 2018-19లో ఎలా ఉందో, మూడున్నరేళ్ళ తర్వాతా అలాగే ఉంది.2018-19లో (2011-12 స్థిర ధరల ఆధారంగా) వ్యవసాయ రంగంలో 10.78 శాతం, మత్స్య పరిశ్రమ 19.09 శాతం, ఉద్యాన రంగంలో 16.07 శాతం, పశు సంవర్ధక రంగంలో 13.3 శాతం, పారిశ్రామిక రంగంలో 10.24 శాతం, సేవా రంగంలో 11.09 శాతం వృద్ధి రేటు నమోదైంది.కానీ ఈ మూడున్నరేళ్ల పాలనలోవ్యవసాయ రంగంలో 20.2 శాతం వృద్ధి సాధించామని జగన్ ప్రభుత్వం గొప్పలు చెప్పడం పచ్చి అబద్దం.ఇది పంట పొలాల్లో పండివచ్చిన పంటలతో కాదు.రొయ్యలు, చేపల సాగును కూడా వ్యవసాయంతో కలిపి వ్యవసాయం రంగంలో అద్భుత ప్రగతి సాధించినట్లు గొప్పలు చెబుతున్నారు .2020-21 లో పారిశ్రామిక రంగం వృద్ధిరేటు మైనస్ 3.26 శాతం నమోదు అయింది.ఇది సున్నా శాతం కంటే తక్కువ.
రాష్ట్రంలో శాంతి భధ్రతలు క్షీణించి భయానక వాతావరణం నెలకొనడం,ప్రతిపనిలో నీకది- నాకిది అనే ఫార్ములాకు భయపడి పారిశ్రామిక వేత్తలు రాష్ట్రం ముఖం చూడక పోగా, వచ్చిన వారు పారిపోతున్నారు.రాష్ట్రంలో గత మూడున్నరేళ్లలో రూ 17 లక్షల కోట్లు పెట్టుబడులు పొరుగు రాషా్టల్రకు తరలిపోయినట్లు సమాచారం.
పరిశ్రమ స్థాపిస్తామని ముందుకు వచ్చిన వారికి ఘనంగా స్వాగతం పలకాల్సి ఉండగా అధికార పార్టీ నాయకులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ వసూళ్లు, మామూళ్లు అంటూ వెంట బడటంతో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన వారు కూడా పారిపోతున్నారు.వేలమందికి ఉపాధి కల్పించగల జాకీ పరిశ్రమ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడంతో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో2017 లో అవసరమైన అనుమతులు, భూ కేటాయింపుల ప్రక్రియ పూర్తి అయింది.
ఎంతో పేరు ప్రతిష్ఠలున్న జాకీ దుస్తులను తయారు చేసే పరిశ్రమకు అనంతపురం జిల్లా రాప్తాడు వద్ద 27 ఎకరాలను కేటాయించడం జరిగింది.రూ 129 కోట్ల పెట్టుబడితో ఏటా 32.4 మిలియన్ల దుస్తులు తయారు చేసే పరిశ్రమ, గిడ్డంగిని అక్కడ ఏర్పాటు చెయ్యాలని కంపెనీ నిర్ణయించింది.ఆ యూనిట్ ద్వారా 6,420 మందికి ఉపాది లభించనుంది .నిర్మాణ స్థలంలో పనులు చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లను ఆ నిర్మాణ సంస్థ పనులు ప్రారంభించింది.కానీ ఆ ప్రాంత అధికార పార్టీ ప్రజాప్రతినిధి నాకు ఎన్నికల్లో రూ 20 కోట్లు ఖర్చుఅయింది.
అందులో సగం ఇవ్వాలని,తానూ చెప్పిన వారికే ఉద్యోగాలు ఇవ్వాలని,సబ్ కాంట్రాక్టులు కూడా నేను చెప్పిన వారికే ఇవ్వాలని బెదిరించడంతో ఆ కంపెనీ మూటా ముల్లే సర్దుకొని పొరుగు రాష్ట్రం తెలంగాణాకి పారిపోయింది.
జాతీయ రహదారిలో 27 ఎకరాల్లో జాకీ పరిశ్రమ పెట్టేందుకు ముందుకు కొస్తే అధికార పార్టీ నాయకుల మామూళ్ళు, బెదిరింపులతో వెళ్ళగొట్టారు.గతంలో కియా ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని హిందూపురం ఎంపీ మాధవ్ బెదిరించడంతో అక్కడ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు కాకుండా పొయ్యాయి.వచ్చే పరిశ్రమలు కూడా రాకుండా పోతుంటే చదువుకున్న యువకులు ఉపాధి ఉద్యోగాలు లేక వలసలు పోతున్నారు.
కావునా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే ఏపీకి మొదటి ర్యాంక్ వచ్చిందని చెప్తున్న సీఎం జగన్ రెడ్డి రాషా్టన్రికి ఈ మూడున్నరేళ్లలో వచ్చిన పరిశ్రమలు, పెట్టుబడులు ఎన్నో శ్వేతపత్రం విడుదల చేసి వాస్తవాలు ప్రజలముందుంచాలి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy