ఛీ - దారుణం : గుడి లో బట్టలిప్పి డాన్సులు

అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంలో అపచారం చోటుచేసుకుంది.సత్యదేవుడి సాక్షిగా పెళ్లి చేసుకుందామని వచ్చిన ఓ కొత్త జంట వెంట వచ్చిన బంధువులు.

పెళ్లి తంతులో భాగంగా ఆలయ ఆవరణలోనే రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేశారు.మహిళా డ్యాన్సర్లతో కలిసి పురుషులు ఆలయ పరిసరాల్లోనే అశ్లీల నృత్యాల్లో మునిగిపోయారు.

ఈ తంతు మొత్తం తమ కళ్ల ముందే జరుగుతున్నా, ఆలయ అధికారులు నోరు మెదపలేదు.తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలోని సత్యదేవుడి ఆలయంలో నిన్న రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

భక్తులిచ్చిన సమాచారంతో అక్కడికి వెళ్లిన ఓ టీవీ న్యూస్ ఛానెల్ ప్రతినిధులు ఈ మొత్తం వ్యవహారాన్ని రికార్డు చేయగా, సదరు ఛానెల్ దీనిని నేటి ఉదయం ప్రసారం చేసింది.

Advertisement
న‌ల్ల‌ని పాదాల‌ను తెల్ల‌గా మార్చే ట‌మాటా..ఎలాగంటే?