‘దేవర’ నుండి ఎన్టీఆర్ పిక్స్.. AI ఆర్ట్ తో అదిరిపోయాయిగా..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ( Director Koratala Siva ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ దేవర.

ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రజెంట్ శరవేగంగా జరుగుతుంది.

స్టార్ట్ చేయడంలో ఆలస్యం అయినప్పటికీ షూటింగ్ కు పెద్దగా గ్యాప్ లేకుండా ఫాస్ట్ గా ఫినిష్ చేస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుండి మెయిన్ క్యారెక్టర్స్ ఫస్ట్ లుక్ లను రిలీజ్ చేసారు.

ఎన్టీఆర్( NTR ) తో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్, విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్( Saif Ali Khan ) ఫస్ట్ లుక్స్ రిలీజ్ అవ్వగా ఈ ఫస్ట్ లుక్ లతో ఈ సినిమాకు మరింత హైప్ పెరిగింది.ఇదిలా ఉండగా ఇప్పుడొక ఇంట్రెస్టింగ్ విషయం నెట్టింట మేకర్స్ షేర్ చేసారు.

ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుపుకుంటూనే మరో వైపు విఎఫ్ఎక్స్ వర్క్ కూడా స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది.

Advertisement

దీనికి సంబంధించి తాజాగా రెండు పిక్స్ నెట్టింట వైరల్ అయ్యాయి.ప్రజెంట్ ఈ పిక్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి.ఈ సినిమాకు సంబంధించిన విఎఫ్ఎక్స్ వర్క్ చేస్తున్న సూపర్ వైజర్ శ్రీనివాస్ మోహన్ ఈ సినిమా నుండి తాజాగా రెండు పిక్స్ ను ట్విట్టర్ లో షేర్ చేసారు.

AI ఇల్యూషన్ టూల్ తో( AI Illusion Tool ) ఎన్టీఆర్ ముఖాన్ని ఇందులో సృష్టించగా ఈ పిక్స్ తెగ ఆకర్షిస్తున్నాయి.

సముద్రం ఒడ్డున ఉన్న పడవలతో ఈ ఫేస్ ను శ్రీనివాస్ డిజైన్ చేసారు.ఈ అద్భుతమైన పిక్స్ చూసి తారక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.ఇదిలా ఉండగా మొత్తం 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ ను కొరటాల ఎంత పవర్ ఫుల్ గా చూపిస్తారో వీరి కలయికలో ఎలాంటి సినిమా వస్తుందో చూడాలి.

ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ కానుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు.

కీర్తి సురేష్ పెళ్లి చీర కోసం అన్ని గంటలు కష్టపడ్డారా.. ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?
Advertisement

తాజా వార్తలు