సైలెంట్ గా రెమ్యునరేషన్ అందుకుని సైడ్ అయిపోతున్న కొరటాల..కారణం ఇదేనా?

మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్ లలో కొరటాల శివ ఒకరు.

ఈయన మొదటి నుండి అందరి కంటే డిఫెరెంట్ గా సినిమాలు చేస్తూ వరుస విజయాలు సాధించాడు.

కానీ మొదటిసారి ఆచార్య విషయంలో మాత్రం పూర్తిగా విఫలం అయ్యాడు.చిరంజీవి, రామ్ చరణ్ తో కలిసి చేసిన ఆచార్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొడతారు అని అంతా అనుకున్నారు.

కానీ భారీ ప్లాప్ మూటగట్టుకున్నాడు.వరుసగా విజయాలు మాత్రమే అందుకుంటున్న కొరటాలకు ఈ సినిమా ఊహించని షాక్ ఇచ్చింది.

ఈ సినిమా వల్ల బయ్యర్లకు భారీ నష్టం వచ్చింది.వీరంతా కొరటాల మీద ఉన్న నమ్మకంతోనే ఈ అంటే అంత పెట్టారు.

Advertisement

కొరటాల చేసిన ప్రతీ సినిమా హిట్ అయ్యింది కాబట్టి బిజినెస్ లో తలదూర్చిన కూడా ఇబ్బంది రాలేదు.కానీ ఆచార్య విషయంలో ఈయన లెక్క తప్పింది.

ఈ సినిమా భారీ నష్టాలను చవిచూసింది.ఈ సినిమా వల్ల కొరటాల చాలా నష్టపోవడంతో ఇక నెక్స్ట్ చేస్తున్న సినిమాలో బిజినెస్ విషయంలో ఎలాంటి వేలు పెట్టకుండా సైలెంట్ గా తనకు రావాల్సిన పారితోషికం తీసుకుని సైడ్ అయిపోతున్నట్టు తెలుస్తుంది.

ప్రెజెంట్ కొరటాల ఎన్టీఆర్ తో 30వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.కొరటాల శివ ఎన్టీఆర్ సినిమాకు 2దాదాపు 5 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నట్టు టాక్.మొత్తానికి ఆచార్య దెబ్బకు కొరటాల బిజినెస్ వ్యవహారం పక్కన పెట్టినట్టు తెలుస్తుంది.ఇక ఈ సినిమా సంక్రాంతి తర్వాత సెట్స్ మీదకు వెళ్లనుంది.2024లో రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.చూడాలి కొరటాల ఎన్టీఆర్ సినిమాతో తనని తాను నిరూపించు కుంటాడో లేదో.

ఏడాదికి పైగా పాకిస్తాన్ లో మగ్గిపోయాం.. రియల్ తండేల్ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు