ఎన్టీఆర్‌ 30 హీరోయిన్‌ పరిశీలన జాబితాలో గీత పేరు కూడా ఉందట

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తుతం జక్కన్న దర్శకత్వంలో ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే.

భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఆ చిత్రంలో ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌ పాత్రను పోషిస్తున్నాడు.

ఎన్టీఆర్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం కోసం ఏకంగా రెండు సంవత్సరాలు తీసుకుంటున్నాడు.ఆ చిత్రం తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్‌ దర్శకత్వంలో చేయాలనే నిర్ణయానికి వచ్చాడు.

ఇప్పటికే ఎన్టీఆర్‌ 30 చిత్రం అధికారిక ప్రకటన వచ్చింది.అరవింద సమేత చిత్రం తర్వాత మరోసారి ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో చిత్రం రాబోతుంది.

ఈ చిత్రం షూటింగ్‌ కు కాస్త సమయం పట్టే అవకాశం ఉంది.ఇదే సమయంలో ఎన్టీఆర్‌ కోసం హీరోయిన్‌ ఎంపిక చేసే పనిలో త్రివిక్రమ్‌ ఉన్నాడని తెలుస్తోంది.

Advertisement
Trivikram Searching For NTR 30 Heroins, NTR RRR, Rajamouli, Trivikram, Aravinda

ఎన్టీఆర్‌కు జోడీగా అరవింద సమేత చిత్రంలో నటించిన పూజా హెగ్డేను నటింపజేయాలని భావిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.కాని ఆమెతో పాటు పలువురు హీరోయిన్స్‌ పేర్లను పరిశీలిస్తున్నారట.

Trivikram Searching For Ntr 30 Heroins, Ntr Rrr, Rajamouli, Trivikram, Aravinda

పూజా హెగ్డేతో పాటు బాలీవుడ్‌ నటి కియారా అద్వానీ ఇంకా ముద్దుగుమ్మ రష్మిక మందన్నను కూడా త్రివిక్రమ్‌ పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.ఇదే సమయంలో జాన్వీ కపూర్‌తో కూడా చర్చలు జరిపినట్లుగా ప్రచారం జరిగింది.అసలు విషయం ఏంటీ అనేది క్లారిటీ రావాలంటే షూటింగ్‌ ప్రారంభం అవ్వాల్సిందే.

ఎందుకంటే షూటింగ్‌కు వెళ్లే సమయంలో త్రివిక్రమ్‌ హీరోయిన్‌ను ఖరారు చేస్తాడని అంతా నమ్మకంగా ఉన్నారు.

పీరియడ్స్ లో నొప్పులా? ఈ చిట్కాలు పాటించండి
Advertisement

తాజా వార్తలు