యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా మరో స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.
ఈ సినిమాలోని తారక్ ఫస్ట్ లుక్‌ను అతడి పుట్టినరోజు అయిన మే 20న రిలీజ్ చేసేందుకు ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.కాగా ఈ సినిమా రిలీజ్ కాకముందే తారక్ తన నెక్ట్స్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.

ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా లాంఛ్ చేసిన తారక్, త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు.ఇక ఈ సినిమాలో త్రివిక్రమ్ తన గత చిత్రాలలోని సెంటిమెంట్‌ను ఫాలో అవ్వాలని చూస్తున్నాడు.
గతంలో పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్రంలో యంగ్ హీరో ఆది పినిశెట్టి ఓ కీలకపాత్రలో నటించిన సంగతి తెలిసిందే.ఆ తరువాత అరవింద సమేత చిత్రంలో నవీన్ చంద్ర, అల వైకుంఠపురములో సినిమాలో సుశాంత్‌లను ముఖ్య పాత్రల్లో నటింపజేశాడు.
ఇప్పుడు తారక్ 30వ చిత్రంలోనూ ఇదే స్ట్రాటజీని కంటిన్యూ చేయాలని త్రివిక్రమ్ చూస్తున్నాడు.దీని కోసం ఓ యంగ్ హీరోను తీసుకోనున్నాడట.
కాగా ఈ సినిమాకు ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్‌ను పెట్టాలని త్రివిక్రమ్ అనుకుంటున్నాడట.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy