క్రికెట‌ర్‌గా ఎన్టీఆర్‌

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ టెంప‌ర్ - నాన్న‌కు ప్రేమ‌తో - జ‌న‌తా గ్యారేజ్ లాంటి మూడు బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ల‌తో సూప‌ర్ ఫామ్‌లో ఉన్నాడు.

ఎన్టీఆర్‌కు పౌరాణికాలు అయినా సాంఘికాలు అయినా కొట్టిన‌పిండే.

య‌మ‌దొంగ‌, బాల రామాయ‌ణం నుంచి ఆది, స్టూడెంట్ నెంబ‌ర్ వ‌న్‌, సింహాద్రి, నాన్న‌కు ప్రేమ‌తో ఇలా ఏ సినిమా చూసినా ఎన్టీఆర్ పాత్ర పోష‌ణ‌లో వైవిధ్యం మ‌న‌కు క‌న‌ప‌డుతుంది.ఈ క్ర‌మంలోనే ఎన్టీఆర్ ఇప్పుడు మ‌రో స‌రికొత్త రోల్‌లో త‌న కొత్త సినిమాలో క‌నిపించ‌బోతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

ఎన్టీఆర్ త‌న 27వ సినిమాను (వ‌ర్కింగ్ టైటిల్ జై ల‌వ కుశ‌) బాబి ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్నాడు.క‌ళ్యాణ్‌రామ్ నిర్మించే ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.

ఈ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్‌లో న‌టిస్తాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి.అయితే ప‌వ‌న్‌-త్రివిక్ర‌మ్ ప్రాజెక్టు డిలే అయ్యే ఛాన్సులు ఉండ‌డంతో ఎన్టీఆర్ బాబి సినిమా కంప్లీట్ అయిన వెంట‌నే వినాయ‌క్‌కు ఓకే చెప్పిన‌ట్టు తెలుస్తోంది.

Advertisement

ఎన్టీఆర్‌-వినాయ‌క్ కాంబోలో తెర‌కెక్కే సినిమాలో ఎన్టీఆర్ బ్యాట్ ప‌ట్టి సిక్స‌ర్లు, ఫోర్లు బాదుతాడ‌ట‌.క్రికెట్ బ్యాక్ డ్రాప్‌లో ఎన్టీఆర్ హీరోగా వినాయక్ ఓ మాంచి మాస్ క‌మ‌ర్షియ‌ల్ స‌బ్జెక్టును రెడీ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

ఇది వినాయ‌క్ స్టైల్లో హై వోల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్క‌నుంద‌ని స‌మాచారం.మ‌రి క్రికెట‌ర్‌గా ఎన్టీఆర్ ఎలా మెప్పిస్తాడో చూడాలి.

Advertisement