ఆర్ఆర్ఆర్ కోసం తారక్ అలా కనిపిస్తాడా..?

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ భారతదేశ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమా చిత్ర వర్గాల్లో భారీ అంచనాలను క్రియేట్ చేసింది.

అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమురం భీం పాత్రలో తారక్ నటిస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.కాగా ఈ సినిమాలో చరణ్, తారక్‌ల లుక్‌లపై పలు వార్తలు ఇప్పటికే సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

Ntr To Go Bald For Rrr-ఆర్ఆర్ఆర్ కోసం తారక్

తాజాగా తారక్ గెటప్‌కు సంబంధించి మరో వార్త తెగ వైరల్ అవుతోంది.ఈ సినిమాలో తారక్ చాలా రఫ్ లుక్‌లో కనిపిస్తాడట.

అయితే ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాల్లో తారక్ గుండుతో కనిపిస్తాడని తెలుస్తోంది.ఈ గెటప్ దాదాపు 15 నిమిషాలపాటు ఉంటుందని, దీని కోసం తారక్ నిజంగా గుండు చేయించుకోనున్నాడనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చచేస్తోంది.

Advertisement

మరి తారక్ నిజంగానే ఈ సినిమాలో గుండుతో కనిపిస్తాడా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది.పాత్రల కోసం ఎలాంటి కష్టమైనా తీసుకునే తారక్, సినిమాలో తన పాత్రకు పూర్తి న్యాయం కోసం గుండు చేయించుకోవడానికి అస్సలు వెనకాడడని తారక్ ఫ్యాన్స్ అంటున్నారు.

ఇక బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మారిస్‌లు హీరోయిన్లుగా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.ఇక ఈ సినిమాన 2021 జనవరి 8న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు