హాలీవుడ్‌ హీరోలా యంగ్‌టైగర్‌

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ ‘టెంపర్‌’ తర్వాత నటిస్తున్న సినిమా తాజాగా లండన్ లో ప్రారంభం అయ్యింది.

సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఆ సినిమాలో హీరోయిన్‌గా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటిస్తున్న విషయం తెల్సిందే.

ఈ సినిమా కథ రిత్యా ఎన్టీఆర్‌ కొత్త ుక్‌లో కనిపించాల్సి ఉంది.అందుకోసం దాదాపు మూడు నెల పాటు ఆగి ఎన్టీఆర్‌ కొత్త లుక్‌ వచ్చిన తర్వాతే షూటింగ్‌ను మొదు పెట్టారు.

తాజాగా ఎన్టీఆర్‌ కొత్త లుక్‌ రివీల్‌ అయ్యింది.షూటింగ్‌ ప్రారంభం సందర్బంగా చిత్ర యూనిట్‌ కొన్ని ఫొటోను విడుద చేసింది.

ఆ ఫొట్లో ఎన్టీఆర్‌ హాలీవుడ్‌ హీరోలా ఉన్నాడు అంటూ అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఏ సినిమాకు ఆ రకంగా మారడంలో ఎన్టీఆర్‌ ముందు ఉంటాడు.

Advertisement

ఆ మధ్య ‘బాద్‌షా’ సినిమా కోసం కొత్త రకం హెయిర్‌ స్టైల్‌ మరియు ‘టెంపర్‌’ కోసం సిక్స్‌ ప్యాక్‌ చేసిన ఎన్టీఆర్‌ తాజాగా సుకుమార్‌ సినిమా కోసం మొత్తం తన లుక్‌నే మార్చేశాడు.ప్రస్తుతం ఎన్టీఆర్‌ కొత్త లుక్‌ ఫొటోు సోషల్‌ మీడియాలో తెగ హల్‌ చల్‌ చేస్తున్నాయి.

ట్విట్టర్‌లో ఎన్టీఆర్‌ ఫొటోు టాప్‌ రేంజ్‌లో ట్రేడ్‌ అవుతున్నాయి.

Advertisement