చరణ్ చేసి పెడితే విషం కూడా తాగుతాను.. తారక్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, చరణ్ మంచి స్నేహితులు అనే సంగతి తెలిసిందే.

ఆ స్నేహ బంధం వల్లే ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సినిమాలో కలిసి నటించడం సాధ్యమైంది.

ఆర్ఆర్ఆర్ సినిమాతో చరణ్, ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపును సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు.అయితే తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ చరణ్ చేసి పెడితే విషం కూడా తాగుతానంటూ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

ఆర్ఆర్ఆర్ సినిమా ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను సైతం పూర్తి చేసుకోగా ఈ సినిమా నిడివి 3 గంటల 6 నిమిషాలుగా ఉంది.ఈ మధ్య కాలంలో ఇంత నిడివితో విడుదలవుతున్న సినిమా ఆర్ఆర్ఆర్ మాత్రమే కావడం గమనార్హం.

దర్శకుడు రాజమౌళిపై ఉండే నమ్మకం వల్ల ఈ సినిమాకు అంచనాలకు అందని స్థాయిలో బిజినెస్ జరిగింది.రిలీజ్ కు ముందే ఈ సినిమా నిర్మాతకు 300 కోట్ల రూపాయలకు పైగా లాభం వచ్చినట్టు తెలుస్తోంది.

Advertisement

అయితే రామ్ చరణ్ ఎన్టీఆర్, జక్కన్నలను కాఫీ తాగుతారా అని అడగగా తారక్ వెంటనే చరణ్ ఇస్తే విషం కూడా తాగుతానని సమాధానం ఇచ్చారు.తారక్ చరణ్ గురించి చేసిన కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఆర్ఆర్ఆర్ యూనిట్ ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ వీడియోలో చరణ్, తారక్ ఒకరిపై ఒకరు వేసుకున్న పంచ్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

చరణ్, తారక్ మధ్య ఉన్న స్నేహ బంధం ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్లస్ అవుతుందని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఆర్ఆర్ఆర్ ఎప్పుడు విడుదలైనా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఆర్ఆర్ఆర్ సినిమా చరణ్, తారక్ ఆశలను నెరవేరుస్తుందో లేదో చూడాల్సి ఉంది.

Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich
Advertisement