అన్నింటికంటే జీవితం చాలా విలువైనది... డ్రగ్స్ కి వ్యతిరేకంగా ఎన్టీఆర్ కామెంట్స్!

ఎన్టీఆర్( NTR ) హీరోగా నటిస్తున్న దేవర( Devara ) సినిమా సెప్టెంబర్ 27వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ సినిమా విడుదలకు మరొక రెండు రోజుల సమయం ఉన్న నేపథ్యంలో ప్రమోషన్లను వేగవంతం చేశారు.

అయితే తాజాగా ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా మరొక వీడియోను విడుదల చేశారు.ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ఎవరైతే తమ సినిమాకు అదనపు షోలు అలాగే టికెట్ల రేట్లు పెంచాలని కోరుకుంటే వారు డ్రగ్స్ కు వ్యతిరేకంగా( Anti Drugs ) వీడియోలను విడుదల చేయాలని అప్పుడే వారి సినిమాకు అన్ని బెనిఫిట్స్ ఉంటాయని తెలిపారు.

Ntr Shared Anti Drug Video Before Devara Release Details, Ntr,devara,anti Drug,r

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ ఈ సినిమాకు అదనపు షోలతో పాటు సినిమా టికెట్ల రేట్లు కూడా పెంచారు.ఈ క్రమంలోనే ఎన్టీఆర్ సైతం డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఒక వీడియోని విడుదల చేశారు.ఇందులో భాగంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.

మన దేశ భవిష్యత్ మన యువత చేతిలోనే ఉంది.కొంతమంది సరదాలకు డ్రగ్స్ తీసుకుంటూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.

Ntr Shared Anti Drug Video Before Devara Release Details, Ntr,devara,anti Drug,r
Advertisement
Ntr Shared Anti Drug Video Before Devara Release Details, Ntr,Devara,Anti Drug,R

మరికొందరు వీటిని అలవాటుగా చేసుకోవడం మరికొందరు స్టైల్ కోసం డ్రగ్స్ తీసుకోవడం జరుగుతుంది.చాలామంది ఒత్తిడి నుంచి బయట పడటానికి లేదంటే స్నేహితులు బలవంతంతోనో డ్రగ్స్ తీసుకొని జీవితాలను పాడు చేసుకుంటున్నారు.అన్నింటికంటే జీవితం చాలా విలువైనది రండి నాతో చేతులు కలపండి డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామ్యులు అవ్వండి.

మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ అమ్మటం కానీ, కొనటం కానీ వినియోగించటం కానీ చేస్తుంటే వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో 8712671111 కు కాల్ చేసి సమాచారం అందించాలి అంటూ ఈ సందర్భంగా ఎన్టీఆర్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు