లైగర్ తో సహా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన ఫ్లాప్ సినిమాలు ఇవే !

కథను మాత్రమే నమ్ముకుని వరుసగా హిట్లు కొడుతున్న హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి.

కథ విన్నాక అది హిట్ అవుతుందా ఫట్ అవుతుందా అని అంచనాకి రావాలంటే తారక్ తర్వాతే ఎవరైనా.

అందుకే తన దగ్గరకు వచ్చే అనేక కథలలో కేవలం హిట్టు అవుతుంది అనుకున్న కథలను మాత్రమే ఎంచుకొని ముందుకు వెళుతున్నాడు.అలా జూనియర్ ఎన్టీఆర్ తన కెరియర్లో వదులుకున్న ఫ్లాప్ సినిమాలు ఏంటో ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి.

లైగర్పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా లైగర్.ఈ కథను కానీ పూరి మొదట ఎన్టీఆర్ కి చెప్పాడట.

కానీ అతడు రిజెక్ట్ చేయడంతో విజయ్ దేవరకొండ దగ్గరికి వెళ్ళింది.కానీ ఫలితం ఏంటో మనందరికీ తెలిసిందే.

Advertisement
Ntr Rejected Flop Movies List , Ntr, Liger, Lie, Srinivasa Kalyanam, Brahmotsava

బ్రహ్మోత్సవంమహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన సినిమా బ్రహ్మోత్సవం.ఈ సినిమా సైతం మొదట తారక్ చేయాల్సి ఉండగా అతనిలో చెప్పడంతో మహేష్ బాబు తో చేశాడు శ్రీకాంత్.

కానీ ఈ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అనే విషయం మన అందరికీ తెలిసిందే.

Ntr Rejected Flop Movies List , Ntr, Liger, Lie, Srinivasa Kalyanam, Brahmotsava

శ్రీనివాస కళ్యాణంనితిన్ హీరోగా నటించిన శ్రీనివాస కల్యాణం సినిమా సైతం తొలుత జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికే వెళ్లిందట.కానీ కథ నచ్చలేదని తారక్ తప్పుకోవడం తో ఈ సినిమా ఫ్లాప్ సినిమాల లిస్ట్ లో చేరింది.లైనితిన్ నటించిన మరో సినిమా లై చిత్రం కూడా మొదట తారక్ దగ్గరికే వెళ్లిందట.

కానీ ఈ కథ కూడా ఎన్టీఆర్ నో చెప్పడంతో మరొక ఫ్లాప్ సినిమా నుంచి తప్పించుకున్నాడు.నా పేరు సూర్యఅల్లు అర్జున్ హీరోగా ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా.

న్యూస్ రౌండప్ టాప్ 20

ఈ చిత్రం సైతం తారక్ చేత రిజెక్ట్ చేయబడింది.

Advertisement

తాజా వార్తలు