ఎన్టీఆర్‌తో సినిమా తీసి అంత నష్టపోయాడా.. ఏకంగా హుస్సేన్‌సాగర్‌లోకే దూకాడుగా..?? 

ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) స్టూడెంట్ నెం.1, ఆది, సింహాద్రి వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ దూసుకెళ్లాడు.

అతనితో ఒక్క సినిమా అయినా తీయాలనుకుంటూ నిర్మాతలు క్యూ కట్టేవారు.

ఎన్టీఆర్ సినిమాలు అప్పట్లో కాసుల వర్షం కురిపించేవి.ఈ హీరోతో చేస్తే మంచి ప్రాఫిట్స్ వస్తాయని అందరూ భావించేవారు కానీ ఒక నిర్మాత మాత్రం ఎన్టీఆర్‌తో సినిమా తీసి బాగా నష్టపోయాడు.

దానివల్ల తీవ్ర మనస్థాపానికి గురై చివరికి హుస్సేన్‌సాగర్‌లోకి దూకి ఆత్మహత్యాయత్నం కూడా చేశాడు.అప్పట్లో ఈ వార్త ఒక సంచలనం అయ్యింది.ఆ నిర్మాత మరెవరో కాదు చెంగల వెంకట్రావు( Chengala Venkat Rao ).ఆయనకు ఎన్టీఆర్ హీరోగా వచ్చిన "నరసింహుడు" సినిమా చాలా నష్టాలు తెచ్చిపెట్టింది.బి.గోపాల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సమీరా రెడ్డి అమీషా పటేల్ వంటి అందాల తారలు హీరోయిన్లుగా నటించారు.చెంగల వెంకట్రావు అప్పటికే సమరసింహారెడ్డి వంటి సూపర్ హిట్ తీసి స్టార్ డైరెక్టర్‌గా ఎదిగాడు.

అయితే బి.గోపాల్, ఎన్టీఆర్ కలిసి తీస్తున్నాను నరసింహుడు సినిమాని నిర్మించేందుకు ఇతడు ముందుకు వచ్చాడు.ఇదొక రివెంజ్ డ్రామా ఈ మూవీ విడుదలకు ముందే "200 కేంద్రాల్లో వంద రోజులు" అని పోస్టర్లు కూడా వేయించాడు బి.గోపాల్.అంటే ఈ సినిమా హిట్ అవుతుందని అతడికి అంత నమ్మకం కలిగింది.

Advertisement

కానీ మూవీ రిలీజ్ అయిన ఫస్ట్ షోకే డిజాస్టర్ టాక్ వచ్చింది.ఈ మూవీలో హీరోకి ఫస్ట్ హాఫ్ లో డైలాగ్స్ ఉండవు.అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ తోని ఈ మూవీని నిర్మించారు.

అప్పట్లో బి.గోపాల్ వరుస హిట్స్ తో దూసుకుపోతున్నారు కాబట్టి వెంకట్రావు డౌట్ పడకుండా కావాల్సినన్ని డబ్బులు సినిమాపై ఖర్చు చేశాడు.కానీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా మనీ కలెక్ట్ చేయలేదు.

వెంకట్రావుకు ఆర్థిక సమస్యలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.మరోవైపు ఉత్తరాంధ్రలో ఈ మూవీ రిలీజ్ కు బ్రేకులు పడ్డాయి.

డిస్ట్రిబ్యూటర్స్ కి డబ్బులు చెల్లించకపోవడంతో మూవీ రిలీజ్ కి వారు అడ్డుపడ్డారు.

ఆ దేశంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్.. హీరోయిన్ ను మార్చాలంటూ?
రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..

మొత్తం డబ్బు సినిమా పైనే పెట్టుబడి పెట్టడం, ఇక్కడి నుంచి ఆశించిన కలెక్షన్లు రాకపోవడం వల్ల వెంకట్రావుకు ఏం చేయాలో తెలియలేదు.చివరికి ఆయనలో బాధ తీవ్రంగా మారింది.ఏమీ ఆలోచించకుండా సదరు నిర్మాత హుస్సేన్‌సాగర్‌లోకి దూకి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు.

Advertisement

పోలీసులు వెంటనే అప్రమత్తమై అతడిని కాపాడారు.ఈ ఘటన జరిగినప్పుడు వెంకట్రావు పాకాయరావుపేట సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు.

టీడీపీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు.అయితే ఇంత పెద్ద సంఘటన జరిగినా టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) గానీ ఎన్టీఆర్ గానీ ఎలాంటి సహాయం చేయలేదు.

అసలు ఈ విషయంలో తల దూర్చలేదు కానీ ఇది దేశవ్యాప్తంగా సంచలనంగా మారి ఎన్టీఆర్ ఇమేజ్‌ను దెబ్బతీసింది.

తాజా వార్తలు