పోస్టర్ రెడీ చేసిన తారక్.. సునామీకి రెడీ అవుతున్న ఫ్యాన్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అతిభారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇప్పటికే ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది.చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నాడు.

కాగా తారక్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అతడి పుట్టినరోజు కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.మే 20న తారక్‌కు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేయనున్నారు.

అయితే పోస్టర్‌తో పాటు తారక్ పాత్రకు సంబంధించిన వీడియోను కూడా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.అయితే ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ అదిరిపోయే ట్రీట్ ఇవ్వడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.

Advertisement

ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్, నటి ఆలియా భట్ కూడా నటిస్తున్నారు.

పోలవరం కోసం విదేశీ నిపుణులు రప్పిస్తున్నాం సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..!!
Advertisement

తాజా వార్తలు