నన్ను వెంటాడే ఎమోషన్ నువ్వు... ఆసక్తికర పోస్ట్ చేసిన ఎన్టీఆర్! 

యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.గత ఏడాది దేవర(Devara) సినిమాతో మన ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయం సాధించాడు.

కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్‌(Prasanth Neel)తో ఓ సినిమా చేస్తున్నాడు.అలాగే వార్-2(War-2) మూవీలో కూడా నటిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులలో ఎన్టీఆర్ ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే ఎన్టీఆర్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

ఈ క్రమంలోనే తాజాగా ఈయన ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఒక ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది.డైరెక్టర్ సుకుమార్ తో కలిసి ఉన్న ఫోటోని ఈయన షేర్ చేశారు.

Advertisement

సుకుమార్ భుజంపై తలవాల్చి ఉన్న ఫోటోని షేర్ చేస్తూ.నన్ను ఎప్పుడు వెంటాడే ఎమోషన్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఇక ఈ ఫోటోని సుకుమార్ భార్య తబిత షేర్ చేస్తూ.తారక్ కి ప్రేమతో అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతుంది.ఇక ఈ ఫోటో చూసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా మీ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా వస్తే బాగుంటుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇప్పటికే సుకుమార్ ఎన్టీఆర్ కాంబినేషన్లో నాన్నకు ప్రేమతో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.  ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా వస్తే చూడాలని అభిమానులు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు.

శ్రీవారికి ఎంత బంగారం ఉందో చెప్పినా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో..!
Advertisement

తాజా వార్తలు