ఆ క్షణం ఎంతో భయపడ్డాను.. ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు!

యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ) త్వరలోనే దేవర సినిమా( Devara Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఇటీవల ముంబైలో డైరెక్టర్ సందీప్ రెడ్డి( Sandeep Reddy ) తో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే.తాజాగా ఈ  ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో విడుదల చేశారు.

ఇందులో భాగంగా ఈయన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ తాను మొదట్లో ముంబై( Mumbai ) అంటే చాలా భయపడే వాడినని తెలిపారు.మొదటిసారి ఒక యాడ్ షూట్ కోసం ముంబైకి వచ్చినప్పుడు భయం వేసిందని తెలిపారు.ఇక్కడ టెక్నీషియన్లు,ఆర్టిస్ట్స్ ఎలా ఉంటారో అని భయపడ్డాను.

Advertisement

RRR ప్రమోషన్స్ సమయంలో ఆ భయం కొంచెం పోయింది.ఆ సమయంలో రాజమౌళి( Rajamouli ) నాకు చాలా గైడ్ చేశారని ఎన్టీఆర్ తెలిపారు.

ఇక ప్రస్తుతం దేవర ప్రమోషన్ల కోసం ముంబైకి వస్తున్న సమయంలో ఏమాత్రం భయం లేదని తెలిపారు.

ప్రస్తుతం ముంబై అంటే భయం పోయిందని అంతా ఒకటే, అందరూ సినిమా కిందే ఉన్నారని అర్ధమయింది అంటూ ఈ సందర్భంగా ఎన్టీఆర్ ముంబై గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కారణంగా నేపథ్యంలో ఇతర భాషలలో కూడా ప్రమోషన్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలను పెంచేసాయి.

ఆచార్య వంటి డిజాస్టర్ సినిమా తర్వాత కొరటాల( Koratala ) దర్శకత్వంలో రాబోతున్న చిత్రం కావడంతో ఈ సినిమా హిట్ కావడం ఆయనకు ఎంతో కీలకంగా మారింది.ఇక ఈ సినిమా విషయంలో ఇటు ఎన్టీఆర్ కొరటాల ఇద్దరు కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తుంది.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!

మరి 27వ తేదీ విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు