తారక్ సరసన హీరోయిన్‌గా శార్వరి ఫిక్స్.. ఆమె కళ్ళు చెదిరే బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే...

తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోగా వెలుగొందుతోన్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం "దేవర"( Devara ) మూవీ చేస్తున్నాడు.

ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌తో కలిసి రొమాన్స్ చేస్తున్నాడు.

బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్న కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.దేవర మూవీ తరువాత ప్రభాస్ వలె జూనియర్ ఎన్టీఆర్ కూడా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాలని ప్లాన్ చేస్తున్నాడు.

వార్ అనే హిట్ యాక్షన్ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న వార్ 2 సినిమాతో ఆయన అరంగేట్రం చేయనున్నాడు.

Interesting Facts About War 2 Movie Heroine Sharvari Wagh,sharvari Wagh,war 2 ,j

వార్ 2 ( War 2 )చిత్ర నిర్మాతలు జూనియర్ ఎన్టీఆర్‌ ఈ సినిమాలో నటించనున్నాడని అధికారికంగా ప్రకటించారు.అయితే ఇప్పుడు అతనికి జోడీగా బాలీవుడ్‌ యంగ్ బ్యూటీ శార్వరి వాఘ్ నటిస్తుందని వార్తలు వస్తున్నాయి.ఈ వార్తపై జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) అభిమానులు ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Interesting Facts About War 2 Movie Heroine Sharvari Wagh,Sharvari Wagh,War 2 ,J

శార్వరి వివరాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.ఆమెకు జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ తో నటించే అవకాశం రావడం చాలా అదృష్టమని అంటున్నారు.

శార్వరి వాఘ్‌( Sharvari Wagh )కి సినిమా ఇండస్ట్రీలో కొంత అనుభవం ఉంది.ఆమె ప్యార్ కా పంచనామా 2, బాజీరావ్ మస్తానీ, సోను కే టిటు కి స్వీటీ వంటి కొన్ని చిత్రాలకు సహాయ దర్శకురాలిగా పనిచేసింది.ఆమె 2014లో నటనా మూవీ పాత్రల కోసం ఆడిషన్ చేయడం కూడా ప్రారంభించింది.2020లో అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ది ఫర్గాటెన్ ఆర్మీ - ఆజాదీ కే లియే అనే వెబ్ సిరీస్‌ ఆమెకు మొదటి బ్రేక్ ఇచ్చింది.ఆమె ఇందులో సన్నీ కౌశల్ సరసన నటించింది.

Interesting Facts About War 2 Movie Heroine Sharvari Wagh,sharvari Wagh,war 2 ,j

2021లో విడుదలైన బంటీ ఔర్ బబ్లీ 2లో హీరోయిన్‌గా చేసింది.మెయిన్ హీరోయిన్‌గా శార్వరి వాఘ్ మొదటి చిత్రమిది.ఆమె రాణి ముఖర్జీ, సైఫ్ అలీ ఖాన్, సిద్ధాంత్ చతుర్వేదిలతో కూడా స్క్రీన్‌ను షేర్ చేసుకుంది.

ఆమె తన నటనతో ప్రేక్షకులనే కాకుండా విమర్శకులను కూడా మెప్పించింది.రెండు బెస్ట్ ఫిమేల్ డెబ్యూ అవార్డులను గెలుచుకుంది.ఆమె బాలీవుడ్‌లో వార్ 2తో సహా మరో నాలుగు చిత్రాలకు సంతకం చేసిందని టాక్.

అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు

ఆమె జునైద్ ఖాన్, షాలిని పాండేలతో కలిసి "మహారాజా"లో, జాన్ అబ్రహంతో "వేదా"లో సినిమాల్లో కూడా కనిపిస్తుంది.శార్వరి వాఘ్ 1996లో మరాఠీ కుటుంబంలో జన్మించింది.

Advertisement

ఆమె తండ్రి శైలేష్ వాఘ్ ఒక బిల్డర్, ఆమె తల్లి నమ్రతా వాగ్ ఆర్కిటెక్ట్.ఆమె ముంబైలోని పాఠశాల మరియు కళాశాలకు వెళ్ళింది.

ఆమె తల్లి తరపు తాతయ్య గతంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న మనోహర్ జోషి.దాంతో ఆమె బ్యాక్‌గ్రౌండ్ తెలిసి అందరూ అవాక్కవుతున్నారు.

తాజా వార్తలు