హిందీలో 3 సినిమాల డీల్ కు ఓకే చెప్పిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. అసలేమైందంటే?

టాలీవుడ్ యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్( Hero Junior NTR ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ మూవీలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

అందులో భాగంగానే ఇటీవలే దేవర సినిమాతో ప్రేక్షకులను పలకరించారు ఎన్టీఆర్.ఇప్పుడు అదే ఊపుతో మరిన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్నారు ఎన్టీఆర్.

పాన్ ఇండియాలో వ‌రుస పెట్టి సంచ‌లన చిత్రాల‌కు సంత‌కాలు చేస్తున్నాడు.ముఖ్యంగా హిందీ బెల్ట్ లో( Hindi belt ) భారీ చిత్రాల‌కు సంత‌కాలు చేస్తూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాడు.

ప్రస్తుతం తార‌క్ టైమింగ్ నిజంగా ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోందని చెప్పాలి.

Ntr Has Signed New Projects In Hindi , Jr Ntr, Tollywood, Bollywood, New Project
Advertisement
Ntr Has Signed New Projects In Hindi , Jr Ntr, Tollywood, Bollywood, New Project

తార‌క్ వేగం ఇత‌రులు అందుకోలేనంత దూకుడుగా ఉంది.కాగా ప్రస్తుతం ఎన్టీఆర్ హిందీలో వార్ 2 మూవీలో ( War 2 movie )నటిస్తున్న విషయం.య‌ష్ రాజ్ ఫిలింస్ లో హృతిక్ రోష‌న్ తో క‌లిసి నటిస్తున్నారు ఎన్టీఆర్.

అయితే ఈ మూవీ తర్వాత వ‌రుస‌గా మూడు చిత్రాల‌కు య‌ష్ రాజ్ ఫిలింస్ లాక్ చేస్తోంద‌ని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.ఇప్ప‌టికే ఈ బ్యాన‌ర్ లో రెండో సినిమా చేసేందుకు తార‌క్ చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల్లో చర్చలు కూడా మొదలయ్యాయి.

వార్ 2తో పాటు మ‌రో రెండు చిత్రాల‌కు య‌ష్ రాజ్ ఫిలింస్ అత‌డిని లాక్ చేసేందుకు ప్ర‌ణాళిక‌ల్లో ఉంది.ఈ బ్యాన‌ర్ త‌న హీరోల‌తో ఎప్పుడూ మూడు సినిమాల డీల్ కుదుర్చుకునేందుకు సిద్ధంగా ఉంటుంది.

Ntr Has Signed New Projects In Hindi , Jr Ntr, Tollywood, Bollywood, New Project

అందులో భాగంగానే తార‌క్ తో రెండో సినిమా మూడో సినిమాకు సంత‌కం చేయించుకునేందుకు ఆస్కారం ఉంద‌ని గుస‌గుస వినిపిస్తోంది.ఎన్టీఆర్ మరో భారీ ప్రాజెక్ట్ కోసం యష్ రాజ్ ఫిల్మ్స్‌తో చర్చలు జరుపుతున్నట్లు హిందీ సినీ వర్గాలలో టాక్ బ‌లంగా వినిపిస్తోంది.ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు తార‌క్ కి స్క్రిప్ట్ వినిపించార‌ని అన్ని పనులు అనుకున్నట్లు జరిగితే ఈ చిత్రం 2025 చివరి నాటికి ప్రారంభ‌మ‌వుతుందని భావిస్తున్నారు.

Ladies Finger, Reduce Overweight, Overweight, Weight Loss Tips, Benefits Of Ladies Finger For Heal

అయితే దర్శకుడి పేరును మాత్రం ఇంకా రివీల్ చేయ‌లేదు.యష్ రాజ్ ఫిల్మ్స్ ( Yash Raj Films )జూనియర్ ఎన్టీఆర్ కోసం ప్రాజెక్ట్‌ ను సమన్వయం చేస్తోంద‌ని స‌మాచారం.

Advertisement

ఆసక్తికరంగా యష్ రాజ్ ఫిల్మ్స్ మూడు చిత్రాల ఒప్పందం కోసం స్టార్‌ లతో సంతకం చేస్తుంది.ఇలాంటి ఏర్పాటుకు ఎన్టీఆర్ అంగీకరించాడా లేదా అనేది అస్పష్టంగానే ఉంది.

అయితే అతి త్వరలో తన రెండో హిందీ సినిమాకు సైన్ చేసే అవకాశం ఉందట.అయితే ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో కొరటాల శివ తెరకెక్కించిన యాక్షన్ చిత్రం దేవర.

ఈ మూవీకి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభించిన సంగ‌తి తెలిసిందే.ఎన్టీఆర్ అద్భుతమైన స్టార్ పవర్ తో భారీ ఓపెనింగులు సాధ్య‌మైనా కానీ ఈ సినిమాకి క్రిటిక్స్ నుంచి కూడా మిశ్ర‌మ స్పంద‌న‌లే వ్య‌క్త‌మ‌య్యాయి.

కానీ పార్ట్ 1 రిలీజ్ కి ముందే కొర‌టాల శివ ఈ చిత్రానికి సీక్వెల్‌ ను కూడా ప్రకటించాడు.సినిమా విడుదలకు ముందే ఇది రెండు భాగాల ఫ్రాంచైజీ అని వెల్ల‌డించారు.

ఇప్పుడు సీక్వెల్ గురించి కొర‌టాల ఆలోచిస్తున్నారా? లేదా? అన్న‌ది సస్పెన్స్ లో ఉంది.

తాజా వార్తలు