దేవర చూసేవరకు నన్ను బ్రతికించండి.. ఫ్యాన్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ దర్శకుడు కొరటాల శివ( Koratala Shiva ) దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) హీరోగా నటించిన తాజా చిత్రం దేవర.

ఈ సినిమా ఈ నెల 27న విడుదల కాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాలు షురూ అయ్యాయి.ఈ సినిమా కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాన్ ఇండియా ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ముఖ్యంగా ట్రైలర్ విడుదలైన తర్వాత విపరీతమైన ఉత్సాహాన్ని సృష్టించింది.

అభిమానులు ప్ర‌స్తుతం రిలీజ్ డే కోసం వేచి చూస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.

Advertisement

తార‌క్ పోస్టర్లు ఫ్లెక్సీల‌కు పాలాభిషాకాలు చేస్తు, ఈ పాన్ ఇండియన్ సినిమా విడుదలకు ముందు త‌మ ఫేవ‌రెట్ స్టార్‌పై తమ ప్రేమను ప్రదర్శిస్తున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా తారక్ కి ఒక కొత్త విన్నపం చేశాడు ఒక వీరాభిమాని.క్యాన్స‌ర్ తో చావు బ‌తుకుల మ‌ధ్య ఉన్న తార‌క్ అభిమాని కౌశిక్( Kaushik ) త‌ల్లిదండ్రులు మీడియా ముందుకు వ‌చ్చి త‌మ బిడ్డ ప‌రిస్థితి గురించి వెల్ల‌డించారు.

బ్ల‌డ్ క్యాన్స‌ర్ తో బెంగ‌ళూరులోని ఒక ప్ర‌యివేట్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న కౌశిక్ తాను చ‌నిపోయే ముందు దేవ‌ర సినిమా చూడాల‌నుకుంటున్నాన‌ని త‌న కోరికను తెలిపాడు.

తాను బ‌త‌క‌న‌ని దేవ‌ర విడుద‌ల తేదీ సెప్టెంబ‌ర్ 27 వ‌ర‌కూ అయినా బ‌తికించాల‌ని డాక్ట‌ర్ల‌ను అత‌డు వేడుకున్న‌ట్టు త‌ల్లిదండ్రులు వెల్ల‌డించిన తీరు హృద‌యాల‌ను క‌ల‌చివేస్తోంది.తిరుప‌తిలో మీడియాతో మాట్లాడిన పేరెంట్ ఈ విష‌యంపై చంద్ర‌బాబు, ప‌వ‌న్, తార‌క్ స్పందించాల‌ని ప్రాధేయ‌ప‌డ్డారు.అభిమానుల‌కు క‌ష్టం ఉంది అంటే వెంట‌నే స్పందిస్తారు తార‌క్.

ఇప్పుడు త‌న అభిమాని కౌశిక్ విష‌యంలో ఎలా స్పందిస్తారో వేచి చూడాలి మరి.మరి తారక్ అభిమాని చివరి కోరికను నెరవేరుస్తాడా, ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నాడు.ఈ విషయాలు తెలియాలి అంటే స్పందించే వరకు వేచి చూడాల్సిందే మరి.

అల్లు అర్జున్ కి ఇష్టమైన సినిమా ఏంటో తెలుసా..? ఆ సినిమాను ఇప్పటి వరకు ఎన్ని సార్లు చూశాడంటే..?
Advertisement

తాజా వార్తలు