ఎన్టీఆర్‌ బర్త్‌ డే సందర్భంగా 'ఎవరు మీలో కోటీశ్వరులు' సర్‌ ప్రైజ్‌?

నందమూరి అభిమానులు గత రెండు మూడు నెలలుగా ఎన్టీఆర్‌ బుల్లి తెర ప్రజెన్స్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కరోనా సెకండ్‌ వేవ్‌ లేకుండా ఉంటే ఇప్పటి వరకు జెమిని టీవీలో ఎవరు మీలో కోటీశ్వరులు షో ప్రారంభం అయ్యేది.

ఆడిషన్స్ నిర్వహిస్తున్న సమయంలో కరోనా వచ్చింది.దాంతో ఎక్కడికి అక్కడ ఆగిపోయింది.

Hero Ntr Evaru Meelo Kotishwarulu Show Update For Birthday, #emk, Evaru Meelo Ko

షో ను నిర్వహించేందుకు నిర్వాహకులు కూడా భారంగా మారింది.జులై లేదా ఆగస్టులో అయినా షో ను ప్రారంభించే అవకాశం ఉందా అంటూ అభిమానులు ఎదురు చూస్తున్నారు.

షో ను భారీ ఎత్తున నిర్వహించేందుకు ఇప్పటికే సెట్టింగ్‌ ను ఏర్పాటు చేయశారు.టీమ్‌ కూడా సిద్దంగా ఉంది.

Advertisement

నెల నెల వారికి పారితోషికాలు కూడా ఇస్తున్నారు.ఇలాంటి సమయంలో ఎవరు మీలో కోటీశ్వరులు షో ను ఇంకా మొదలు పెట్టక పోవడం తో నిర్వాహకులు నష్టాలను చవిచూడాల్సి వస్తుందని సమాచారం.

అందుకే అతి త్వరలో కీలక విషయాన్ని అనౌన్స్ చేయబోతున్నారట.ఎన్టీఆర్‌ జెమిని టీవీలో ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్న వారికి ఆయన బర్త్‌ డే సందర్బంగా అంటే మరో రెండు రోజుల్లో క్లారిటీ ఇవ్వబోతున్నారు.

జెమిని టీవీ వారు కొత్త ప్రోమోతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఆ ప్రోమోలో ఎప్పటి నుండి షో ప్రారంభం అవుతుంది అనే విషయాన్ని చెప్పే అవకాశం ఉందంటున్నారు.

జూన్ అంటూ కొందరు అంటున్నా కూడా జులై లో షో ఉండే అవకాశం ఉందని కొందరు జెమిని వర్గాల వారు చెబుతున్నారు.మొత్తంగా ఈ షో కు సంబంధించిన కీలక అప్‌ డేట్ మాత్రం ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్బంగా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.

Ladies Finger, Reduce Overweight, Overweight, Weight Loss Tips, Benefits Of Ladies Finger For Heal

మరో వైపు ఎన్టీఆర్‌ నటిస్తున్న ఆర్‌ ఆర్‌ ఆర్‌ నుండి కూడా కొత్త పోస్టర్‌ రాబోతుంది.అలాగే కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ 30 సినిమాను కూడా అధికారికంగా ప్రకటించి టైటిల్‌ ను అనౌన్స్ చేయబోతున్నారు.

Advertisement

మొత్తానికి ఎన్టీఆర్‌ బర్త్‌ డే సందర్బంగా సందడి భారీగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తాజా వార్తలు