దైవభక్తి చాటుకున్న ఎన్టీఆర్..ఆ ఆలయానికి లక్షల్లో విరాళం.. ఎక్కడంటే?

యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ) ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

అయితే ప్రస్తుతం మాత్రం ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ సొంతం చేసుకోవడమే కాకుండా ఈయన పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు.ప్రస్తుతం ఎన్టీఆర్ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉంటూ వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నారు.

ఇలా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఎన్టీఆర్ తరచూ ఏదోక విషయం ద్వారా వార్తలలో నిలుస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా ఎన్టీఆర్ పేరు మరోసారి వైరల్ అవుతుంది.ఎన్టీఆర్ భారీ స్థాయిలో రెమ్యూనరేషన్( NTR Remuneration ) అందుకుంటూ ఎంతో లగ్జరీ లైఫ్ గడుపుతున్నారనే సంగతి మనకు తెలిసిందే.

అయితే తాజాగా ఎన్టీఆర్ తనలో ఉన్నటువంటి దైవ భక్తిని చాటుకున్నారు.ఈయన ఒక ఆలయ( Temple ) నిర్మాణ పనులలో భాగంగా భారీ స్థాయిలో విరాళం( Donation ) అందజేశారు.

Advertisement

ఎన్టీఆర్ తూర్పు గోదావరి జిల్లాలోని( East Godavari District ) జగ్గన్నపేటలో ఉన్న భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయ నిర్మాణానికి విరాళం ఇచ్చారని తెలుస్తుంది ఇదే విషయాన్ని సదరు గ్రామ ప్రజలు ఓసిలాఫలకంపై ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల పేర్లను వేయించడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  జగ్గన్నపేట భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ 12 లక్షల 50 వేల రూపాయలు విరాళం ఇచ్చారు.గుడి బయట ప్రహరీ గోడ కోసం అయిన  ఖర్చు మొత్తం ఎన్టీఆర్ భరించారని తెలుస్తోంది.

ఇక ఎన్టీఆర్ పేరుతో పాటు తన భార్య తల్లి ఇద్దరు కుమారుల పేర్లను కూడా ఇక్కడ వేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు