ప్రేక్షకులను గొర్రెలనుకున్నారా.. ఆ సినిమా తీయడమే ఎన్టీఆర్ చేసిన పెద్ద బ్లండర్?

అనార్కలి( Anarkali ), ఈ పేరు మీరు చాలా సార్లు వినే ఉంటారు.ఈ లెజెండరీ లేడీకి చరిత్రలో చాలా ప్రాముఖ్యత ఉంది.

ఆమెను ఒక అందమైన మహిళగా అభివర్ణిస్తుంటారు.అంతేకాదు బతికున్నప్పుడు చాలా అద్భుతంగా డ్యాన్స్ చేసేదట.

అనార్కలి 16వ శతాబ్దంలో మొఘల్ రాజు సలీమ్ అనే రాకుమారుడిని ప్రేమించిందని చరిత్ర చెబుతుంది.వీరి లవ్ స్టోరీ గురించి ఎన్నో కథలు వచ్చాయి.

వాటి ఆధారంగా అనేక సినిమాలూ చేశారు.ముఖ్యంగా 1950-80 కాలాల్లో అనార్కలి మీద, ఆమె లవ్ స్టోరీపై చాలా భాషల్లో అనేక సినిమాలు తెరకెక్కాయి.

Advertisement

అదే సంవత్సరం సీనియర్ ఎన్టీఆర్ "అక్బర్ సలీం అనార్కలి( Akbar Salim Anarkali )" సినిమా తీశారు.దీనికి ఆయనే కథ, స్క్రీన్ ప్లే రాశారు, దర్శకత్వం కూడా చేశారు.

అంతేకాదు ఇందులో అక్బర్ పాత్రను పోషించారు.

కానీ ఆ సినిమా ప్రేక్షకుకి నచ్చలేదు.అందుకే ఫెయిల్ అయింది.ఈ సినిమా ఫెయిల్ కావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి.

అవేంటో తెలుసుకుంటే, 1960లో హిందీలో "మొఘల్ ఎ ఆజం( Mughal-E-Azam)" సినిమా విడుదలైంది.అందులో అక్బరుగా పృధ్వీరాజ్ , సలీంగా దిలీప్ కుమార్ కనిపించారు.

దారుణం.. మురికి కాలువ నీటితో కూరగాయలు కడుగుతున్న వ్యాపారి... వీడియో చూస్తే గుండెలు గుభేల్!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి3, సోమవారం 2025

ఈ సినిమాని ఎన్టీఆర్ బాగా చూసినట్లు ఉన్నారు.ఎందుకంటే తన ఒరిజినల్ సినిమాలో ఆ పృధ్వీరాజ్ లాగానే డైలాగులు చెప్పారు.

Advertisement

నిజం చెప్పాలంటే 1955లో అంజలీ పిక్చర్స్ సంస్థ అనార్కలి మూవీ నిర్మించింది.ఇది సూపర్‌ హిట్టయింది.

ఆదినారాయణ రావు కంపోజ్ చేసిన పాటలు, అందించిన సంగీతం ఈ సినిమా మొత్తానికి హైలైట్ అయ్యాయి.ఇందులో యస్వీఆర్ – అంజలీదేవి – అక్కినేనిల నటన ఆడియన్స్ కి బాగా నచ్చేసింది.

ఇక 23 ఏళ్లకు అంటే 1978లో దాదాపు అదే పాత్రలతో, స్టోరీతో ఎన్టీఆర్ సినిమా చేశారు.అయితే అందులో అనార్కలి పాత్ర చేసిన హీరోయిన్‌ను, అంజలీదేవిను పోలుస్తూ చాలామంది విమర్శలు చేశారు.

ఎన్టీఆర్ తీసిన సినిమాలోని పాటలు సి.నారాయణరెడ్డి రాయగా సి.రామచంద్ర సంగీతం సమకూర్చారు.ఇందులో మహమ్మద్ రఫీ , సుశీలమ్మ పాడిన "సిపాయీ ఓ సిపాయీ" పాట హిట్టయింది.

మిగిలిన పాటలన్నీ పెద్దగా ఆకట్టుకోలేదు.అవి మెలోడీ సాంగ్స్‌యే కానీ ప్రజలకు నచ్చలేదు.

సలీంగా బాలకృష్ణ ( Balakrishna)చాలా హ్యాండ్సమ్ గా కనిపించాడు.అనార్కలిగా దీప కనిపించింది.

జోధాగా జమున, తాన్సేనుగా గుమ్మడి అద్భుతంగా నటించి మెప్పించారు.బాలకృష్ణ ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమాని ఇంకా చూడకపోతే ఒకసారి చూసేయొచ్చు.అలాగే అంజలీదేవి నటించిన అనార్కలి (1955) సినిమా కూడా యూట్యూబులోనే వీక్షించవచ్చు.1966లో మళయాళంలో కూడా అనార్కలి కథతో ఒక మూవీ వచ్చి అది కూడా హిట్ అయింది.ఎటొచ్చి ఎన్టీరామారావే దెబ్బైపోయారు.

ఆయన తన సినిమా విషయంలో బాగా జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సింది.అనార్కలి ప్రేమ కథ తీసిన ప్రతి సినిమా హిట్ అయిందని తనది కూడా హిట్ అవుతుందనే ఒక ధీమాతో ఈ సినిమా తీసినట్లున్నారు.

అదే ఆయన చేసిన పెద్ద బ్లండర్ అయింది.

తాజా వార్తలు