ఎన్టీఆర్ వర్ధంతి రోజు బాలయ్యకి పెద్ద షాక్..! యూట్యూబ్ లో ఏమని కామెంట్స్ చేస్తున్నారో చూడండి!

బాలకృష్ణ, క్రిష్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’ మీద కంటే వర్మ చూపించబోయే అసలు కథమీదే అభిమానులు ఆసక్తికనబరుస్తున్నారు.

ఎన్టీఆర్‌ మహానాయకుడు సినిమాను వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

అయితే ఈ గ్యాప్‌లోనే వర్మ లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రం కూడా రాబోతుంది.మొదట వర్మ తీసిన ఎన్టీఆర్‌ సినిమా తర్వాత, క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్‌ మహానాయకుడు రాబోతుంది.

ఈ రెండు సినిమాలు కూడా సేమ్‌ స్టోరీతో రాబోతున్నాయి.ఎన్టీఆర్‌ రాజకీయ జీవితం గురించి దర్శకుడు క్రిష్‌ చూపించబోతున్నాడు.

వర్మ కూడా ఎన్టీఆర్‌ రాజకీయ జీవితంలోని ఒడిదొడుకులు మరియు లక్ష్మీ పార్వతి ఎంట్రీని చూపించబోతున్నాడు.ఒక్కో పాత్ర కోసం అచ్చంగా వాళ్లను తలపించేలా ఉండే నటులను తీసుకొస్తున్నాడు వర్మ.

Advertisement

ఇప్పుడు కూడా ఇదే చేశాడు ఈ ద‌ర్శ‌కుడు.ఇప్పటికే విడుదలైన లక్ష్మీ పార్వతి, చంద్రబాబు నాయుడు లుక్స్ బీభత్సంగా ట్రెండ్ అయ్యాయి.

ఇప్పుడు వర్మ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఆ పోస్ట్ ను విడుదల చేశారు.ఈ పోస్ట్ ద్వారా ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రను పరిచయం చేశారు.

కాగా, కుర్చీలో కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తూ, ఆవేదనతో నిండి ఉన్న ఎన్టీఆర్ పాత్ర కనిపించింది.ఈ పాత్రను ఎవరు పోషిస్తున్న విషయం ఈ వీడియో ద్వారా వెల్లడించక లేదు.

వెన్నుపోటుకు గురైన ఎన్టీఆర్.‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం ద్వారా మళ్లీ తిరిగి వచ్చారని, ప్రాణం పొసుకున్నారన్న అర్థం వచ్చేలా వర్మ తన పోస్ట్ లో వ్యాఖ్యానించారు.

ఎన్టీఆర్ పాత్రను పోషించిన వ్యక్తి పేరు మాత్రం చెప్పలేదు వర్మ.రాకేశ్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను జీవీ ఫిలింస్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు.కళ్యాణ్ మాలిక్ మ్యూజిక్ డైరెక్టర్.

Advertisement

ఇప్పటికే సినిమాలోని రెండు పాటల్ని వర్మ రిలీజ్ చేశాడు.ఇక ఈ ఫస్ట్ లుక్ చూసిన వారంతా వర్మపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

కావాలంటే మీరే కామెంట్స్ చూడండి.బాలయ్య బాబు చేసినదానికంటే ఇదే చాలా బాగుంది అంటున్నారు.

ఇక కొంతమంది అయితే వర్మకి ధైర్యం ఎక్కువ.ఈ దెబ్బతో బాబుకి చమటలు పట్టడం పక్కా అంటున్నారు.

ఎన్టీఆర్ గారి వర్ధంతి రోజున సరిగ్గా టైం చూసి రిలీజ్ చేసాడు వర్మ.ఈ దెబ్బతో బాలయ్య బాబు కి పెద్ద షాక్.

ఇక మహానాయకుడు పరిస్థితి ఏమవుతుందో.?-->.