ఎన్టీఆర్ కొరటాల సినిమా ఇప్పట్లో లేనట్టేనా

ఎన్టీఆర్‌ హీరో గా కొరటాల శివ దర్శకత్వం లో సినిమా ను ప్రకటించి చాలా కాలం అయ్యింది.

గత ఏడాది ఆర్ ఆర్‌ ఆర్‌ విడుదల అయ్యి ఉంటే అప్పుడే ప్రారంభం అయ్యి ఇప్పటి వరకు విడుదల అయ్యేది.

కాని కరోనా ఇతర కారణాల వల్ల సినిమా ఆలస్యం అయ్యింది.ఇప్పుడేమో సినిమా స్క్రిప్ట్ రెడీ అవ్వలేదు అంటున్నారు.

కొరటాల శివ తెరకెక్కించిన ఆచార్య సినిమా భారీ డిజాస్టర్ గా నిలవడమే ఈ సమస్య కు కారనం అనేది చాలా మంది అభిప్రాయం.తెలుగు రాష్ట్రాల్లో ఆచార్య పై పెరిగిన హోప్స్‌ ను సినిమా అందుకోలేక పోయింది.

ఆచార్య అట్టర్ ప్లాప్ కు పూర్తి బాధ్యత ను దర్శకుడు కొరటాల శివ తీసుకోవాల్సి వచ్చింది.అంతే కాకుండా ఫైనాన్సియల్‌ గా కూడా ఆయన చాలా విషయాల్లో ఇబ్బందిని ఎదుర్కొన్నాడు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్.

Advertisement

అందుకే కొరటాల శివ తదుపరి సినిమా అయిన ఎన్టీఆర్ 30 విషయంలో అదుగో ఇదుగో అంటూ మీన మేషాలు లెక్కించాల్సిన పరిస్థితి వచ్చింది.ఇప్పటికి కూడా షూటింగ్‌ ను మొదలు పెట్టే ఉద్దేశ్యం తో ఎన్టీఆర్‌ కనిపించడం లేదు.

ఎన్టీఆర్‌ గెటప్ ను చూస్తుంటే కొత్త సినిమా కోసం రెడీ అవుతున్నట్లుగా లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఎన్టీఆర్‌ తాజాగా బింబి సార ఈవెంట్ లో కనిపించిన సందర్బంగా ఖచ్చితం గా సన్నగా కనిపించి కొరటాల శివ సినిమా కు సంబంధించిన అప్డేట్‌ ఇస్తారని అంతా భావించారు.

కాని ఆయన లుక్ చూస్తే మాత్రం ఎన్టీఆర్‌ 30 ఇప్పట్లో ప్రారంభం అయ్యే అవకాశం లేదని తేలి పోయింది.ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం లో కూడా ఎన్టీఆర్ ఒక సినిమా చేయాల్సి ఉంది.

ఆ సినిమా ఎప్పటికి పట్టాలెక్కేనో.!.

సూదిలేని టీకా వచ్చేస్తుంది..... స్వదేశీ తొలి డీఎన్ఏ ఆధారిత టీకా
Advertisement