త్వరలో పుతిన్ వద్దకు మోదీ దూత అజిత్ దోవల్... ఈ చర్చలు కోసమేనా?

రష్యా - భారత్ స్నేహం ఈనాటిది కాదు.ప్రపంచ దేశాల సంగతి ఎలాగున్నా రష్యా భారత్ కి ఎప్పటికీ మిత్ర దేశమే.

ఇకపోతే త్వరలో పుతిన్ వద్దకు మోదీ దూత అజిత్ దోవల్ ని పంపే అవకాశం ఉందన్న విషయం బయటకు పొక్కిననాటి నుండి రకరకాల ఊహాగానాలు నేషనల్ మీడియాలో వస్తున్నాయి.దాదాపు ఏడాది కాలంగా రష్యా-ఉక్రెయిన్ మధ్య హోరాహోరీగా యుద్ధం కొనసాగుతున్న సంగతి విదితమే.

గత సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీన మొదలైన ఈ యుద్ధం నాటికీ కొనసాగడం బాధాకరం.ఈ క్రమంలో ఉక్రెయిన్‌లోని పలు నగరాలు అయినటువంటి మరియోపోల్, క్రిమియా, డాన్‌బాస్, మెలిటొపోల్, డొనెట్స్క్, ఖేర్సన్, సుమి, లుహాన్స్క్, ఒడెస్సా, చెర్న్‌హీవ్.

వంటి నగరాలను రష్యా సైనిక బలగాలు స్వాధీనం చేసుకున్న సంగతి విదితమే.

Advertisement

ప్రస్తుత తాజా పరిణామాల మధ్య జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్.రష్యాలో పర్యటించనున్నారు.దాదాపు 2 రోజుల పాటు ఆయన పర్యటన అక్కడ కొనసాగుతుంది.

ఈ నేపథ్యంలోనే బుధవారం ఆయన మాస్కోకు వెళ్లారు.ఆసియా దేశాలు ఆఫ్ఘనిస్తాన్ లో ఉమ్మడిగా చేపట్టాల్సిన భద్రత చర్యలు, పసిఫిక్ రీజియన్ లో సరిహద్దు ఉద్రిక్తతలు.

వంటి అంశాలపై చర్చించడానికి మాస్కోలో ఏర్పాటు కానున్న అంతర్జాతీయ స్థాయి సమావేశానికి ఆయన హాజరు కానున్నట్టు సమాచారం.

ఇకపోతే ఉక్రెయిన్ ని తక్కువ అంచనా వేసిన రష్యాకి ఉక్రెయిన్ మంచి పోటీ ఇస్తోంది.11 నెలలుగా రష్యా సైన్యాన్ని ఉక్రెయిన్ ధీటుగా ఎదుర్కొంటోంది అంటే మాటలు కాదు.కొన్ని సందర్భాల్లో అయితే రష్యాని మట్టికరిపోయించింది కూడా.

ప్రతి వారం 5 గ్రాముల బంగారం.. మణికంఠ ఇచ్చిన బంపర్ ఆఫర్ ఇదే!
ఎలాన్ మస్క్ కూడా కాపీ కొడతాడా.. ఆ డైరెక్టర్ సంచలన ఆరోపణలు..?

ఈ క్రమంలో రష్యా ఆధీనంలో ఉన్న కొన్ని కీలక నగరాలను విడిపించుకోగలిగింది.అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, ఆస్ట్రేలియా సహా యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు అందిస్తోన్న ఆయుధాలు, యుద్ధ సామాగ్రితో రష్యా దూకుడుకు అడ్డుకట్ట వేయగలుగుతోంది ఉక్రెయిన్.

Advertisement

తాజా వార్తలు