ఇండియా లైఫ్‌స్టైల్ బెస్ట్ అంటున్న కెనడా ఎన్నారై.. కారణం తెలిస్తే అవాక్కవుతారు...

డబ్బు, మంచి చదువులు, సూపర్ లైఫ్‌స్టైల్.ఇలాంటి కలలతో కెనడా( Canada ) లాంటి దేశాలకు పరుగులు తీసే భారతీయులు( Indians ) వేలల్లో ఉంటారు.

ఏళ్లుగా ఇదే ట్రెండ్ నడుస్తోంది.కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అవుతున్నట్టు కనిపిస్తోంది.

విదేశాల్లో స్థిరపడిన మనోళ్లు (ఎన్నారైలు) చాలామంది ఇప్పుడు ఇండియాకు తిరిగి వచ్చేస్తున్నారు.మారుతున్న ఆలోచనలు, అక్కడి పరిస్థితులే దీనికి కారణం.

తాజాగా, కెనడాలో ఉంటున్న ఓ ప్రొఫెషనల్( Professional ) సరిగ్గా ఇలాంటి షాకే ఇచ్చాడు.కెనడా వెళ్లి కేవలం ఏడాది తిరిగేలోపే తాను ఇండియాకు తిరిగి వచ్చేయాలని ఎందుకు అనుకుంటున్నాడో చెప్పిన కారణాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Advertisement

ఈ వ్యక్తి తన భార్య, బిడ్డతో కలిసి క్లోజ్డ్ వర్క్ పర్మిట్( Closed Work Permit ) మీద కెనడా వెళ్లాడు.కానీ, అక్కడ ఉండటం వల్ల పెద్దగా లాభాలు కనిపించడం లేదని అంటున్నాడు.

ఇండియాలో ఉన్నప్పుడు భార్యాభర్తలిద్దరూ బాగానే సంపాదించేవారట.ఏడాదికి దాదాపు రూ.30 లక్షలు (అంటే 50,000 కెనడియన్ డాలర్లు) పొదుపు చేసేవారట.అదే కెనడాలో ఇద్దరూ కష్టపడితే సుమారు 100,000 కెనడియన్ డాలర్లు (అంటే రూ.60 లక్షలు) వరకు సేవ్ చేయొచ్చు.అయినా సరే, కెనడా కన్నా ఇండియాలోనే ఇప్పుడు లైఫ్‌స్టైల్ చాలా బాగుందని అతను గట్టిగా నమ్ముతున్నాడు.

• రెండు దేశాల్లో లాభనష్టాల బేరీజు (అతని దృష్టిలో):

కెనడాలో ఉండటం వల్ల ప్లస్ పాయింట్స్:

ఫ్రీ హెల్త్‌కేర్: కానీ, ఇండియాలో మంచి ఇన్సూరెన్స్ తీసుకున్నా దాదాపు ఇలాంటి కవరేజ్ ఉంటుందనేది ఇతని ఫీలింగ్.ఫ్రీ ఎడ్యుకేషన్: ఇది మాత్రం కీలకమైన అడ్వాంటేజ్ అని ఒప్పుకున్నాడు.పెద్ద ఇళ్లు, పెద్ద కార్లు: ఇవి తనకు అనవసరమని కొట్టిపారేశాడు.బంధువుల్లో గౌరవం: దీని గురించి పెద్దగా పట్టించుకోనని చెప్పాడు.7-8 ఏళ్లు ఆగితే బాగా డబ్బు సంపాదించే ఛాన్స్: అలాగే ఫిక్స్‌డ్ జాబ్ టైమింగ్స్ (9 గంటల నుంచి 5 గంటల వరకు).

• ఇండియాకు తిరిగి రావడం వల్ల ప్లస్ పాయింట్స్:

వాతావరణం ( Weather ) చాలా బాగుంటుంది.మన సంస్కృతి, మనవాళ్లు.

కుటుంబానికి దగ్గరగా ఉండొచ్చు.వయసు పైబడిన తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకునే అవకాశం.

ఎంత ప్రయత్నించినా జుట్టు రాలడం ఆగట్లేదా.. అయితే మీరు ఇది ట్రై చేయాల్సిందే!

మంచి తిండి, తిన్నది చక్కగా అరుగుతుంది.ఉద్యోగం చేస్తూనే, సైడ్‌గా ఏదైనా బిజినెస్ పెట్టుకునే అవకాశం.

Advertisement

పిల్లల పెంపకంలో కుటుంబ సభ్యుల సపోర్ట్ ఉంటుంది.

అతను పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో పెద్ద చర్చే రేపింది.ఒక్కొక్కరూ ఒక్కోలా స్పందించారు.కొందరు "కెనడాలోనే వర్క్-లైఫ్ బ్యాలెన్స్ అదిరిపోతుంది, టైమ్‌కి వచ్చి టైమ్‌కి వెళ్లొచ్చు, డాలర్లలో సంపాదనతో ఆర్థిక స్వేచ్ఛ ఎక్కువ" అని వాదించారు.

పైగా, వేరే దేశాలకు టూర్లు వేయడం కూడా ఈజీ అని గుర్తుచేశారు.మరికొందరు "ఇండియాలో కిక్కిరిసిన నగరాలు, అధ్వాన్నమైన రోడ్లు-వసతులు, అవినీతి ఇవన్నీ చూస్తే ఇక్కడ ఉండాలనిపించదు" అంటూ ఇండియాలో ఉన్న మైనస్‌లను ఎత్తి చూపారు.

అయితే, చాలామంది మాత్రం ఆ ఎన్నారై చెప్పిన దాంతో ఏకీభవించారు."కెనడాలో హెల్త్‌కేర్ సిస్టమ్ సరిగా లేదు, ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా చాలా నిరాశపరిచింది" అంటూ తమ అనుభవాలు పంచుకున్నారు.2015 నుంచి కెనడాలోనే ఉంటున్న మరో ఎన్నారై "ఇండియాలోని ట్రాఫిక్, కాలుష్యం, జనాల రద్దీ చూస్తే ఇక్కడ జాబ్ చేయగలనా అని నాకే డౌట్.కానీ, వయసైపోతున్న మా అమ్మానాన్నల కోసం మాత్రం తిరిగి రావాలనిపిస్తుంది.

పూర్తిగా కాదు, అప్పుడప్పుడూ వచ్చి వెళ్లడానికి." అని అన్నాడు.ఇంకో యూజర్ కాస్త లెక్కలతో చెప్పాడు: "కెనడాలో లక్ష డాలర్లు (రూ.60 లక్షలు) సేవ్ చేయడం కన్నా ఇండియాలో రూ.30 లక్షలు సేవ్ చేయడమే మంచిది కావచ్చు.కానీ, మీరు మీ పిల్లలకు ఎలాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటున్నారు అనే దానిపై ఇది ఆధారపడి ఉంటుంది" అని కామెంట్ చేశాడు.

తాజా వార్తలు