వతన్ ప్రేమ్ యోజన ... స్వగ్రామాల రూపు రేఖలు మారుస్తోన్న ఎన్ఆర్ఐలు

వృత్తి , ఉద్యోగ వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్లిన ప్రవాస భారతీయులు( NRIs ) జన్మభూమి పట్ల అభిమానం చాటుకుంటూనే ఉన్నారు.

దేశానికి విదేశీ మారక ద్రవ్యంతో పాటు ఇక్కడ సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ విరివిగా పాల్గొంటున్నారు.

కంపెనీలు, పరిశ్రమలు స్థాపించి యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున్నారు.తమ సొంత గ్రామాలను దత్తత తీసుకుని వాటి అభివృద్ధికి తోడ్పడుతున్నారు.

తాజాగా ప్రభుత్వ - ప్రైవేట్ భాగస్వామ్యం కింద ఎన్ఆర్ఐలు తమ స్వస్థలాల అభివృద్ధికి తోడ్పడేలా ప్రోత్సహించే ‘‘వతన్ ప్రేమ్ యోజన ’’( Vatan Prem Yojana ) ద్వారా గుజరాత్ గ్రామీణ( Gujarat Villages ) దృశ్యం గణనీయమైన మార్పును చూస్తోంది.

2021లో ప్రారంభించబడిన ఈ పథకం.గుజరాతీ మూలాలు కలిగిన ప్రవాస భారతీయులు వారి స్వగ్రామాలలో పాఠశాలల పునరుద్ధరణ, ఇతర మౌలిక సదుపాయాల వంటి ప్రాజెక్ట్‌లకు నిధులుగా విరాళాలను ఇవ్వొచ్చు.ఖేడా జిల్లాలోని ఖథల్ గ్రామం ఈ పథకం ద్వారా లబ్ధి పొందిందని గ్రామ సర్పంచ్ జాలా తెలిపారు.

Advertisement

ముఖ్యంగా విద్యారంగంలో అభివృద్ధి సాధించినట్లు ఆయన చెప్పారు.ఎన్ఆర్ఐల నుంచి వచ్చిన రూ.72 లక్షల విరాళాల కారణంగా గ్రామంలో ఇప్పుడు దాదాపు 400 మంది విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించే కొత్త పాఠశాల ఉందని, ఇది ఇతర గ్రామాలకు స్పూర్తినిస్తుందని జాలా అన్నారు.

తమ గ్రామం సాధించిన పరివర్తనను చూడటానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తారని .దీనిని ఎలా సాధించారో తెలుసుకోవడానికి వారు ఆసక్తి చూపిస్తున్నారని జాలా చెప్పారు.వతన్ ప్రేమ్ యోజన కింద దీనిని సాధించినట్లు ఆయన వెల్లడించారు.ఖేడా జిల్లాలోని ఉత్తర సంద గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐలు కూడా ఆధునీకరణకు తోడ్పాటును అందిస్తున్నారు.12000 జనాభా కలిగిన ఈ స్మార్ట్ విలేజ్.పాఠశాలలు, స్మశాన వాటికలు, బస్ స్టాప్‌లు, చెరువులు అప్‌గ్రేడ్ చేయబడుతున్నాయి.

ఇవన్నీ ఎన్ఆర్ఐల సహాకారంతోనే సాధ్యమైందని గ్రామస్తులు చెబుతున్నారు.ఉత్తరసందకు రూ.9 కోట్ల విరాళాలు అందాయని దీని వలన చెరువుల సుందరీకరణ, ఆధునిక బస్ స్టాండ్ వంటి ప్రాజెక్ట్‌లు ప్రారంభమయ్యాయి.

ఉల్లి తొక్కలతో ఊడిపోయే జుట్టుకు ఎలా చెక్ పెట్టవచ్చో తెలుసా?
Advertisement

తాజా వార్తలు