రేపు కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌వికి నోటిఫికేష‌న్

కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌వికి రేపు నోటిఫికేష‌న్ జారీ కానుంది.సీడ‌బ్ల్యూసీ నిర్ణ‌యం మేర‌కు ప‌ద‌వికి ఎన్నిక‌లు అక్టోబ‌ర్ 17న జ‌ర‌గ‌నుండ‌గా.

అక్టోబ‌ర్ 19న ఫ‌లితాల‌ను ప్ర‌క‌టిస్తారు.ఈ మేర‌కు సెప్టెంబ‌ర్ 24 నుంచి 30 మ‌ధ్య నామినేషన్లు స‌మ‌ర్పించ‌వ‌చ్చు.

అదేవిధంగా నామినేష‌న్లు స‌మ‌ర్పించేందుకు ఎవ‌రైనా ముందుకు రావొచ్చ‌ని ఇటీవ‌లే కాంగ్రెస్ ఎంపీ వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే.అయితే, సుదీర్ఘ కాలం త‌ర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వికి ఎన్నిక జ‌ర‌గ‌బోతోంది.2019 ఓట‌మి అనంత‌రం పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు.అప్ప‌టినుంచి సోనియా గాంధీనే తాత్కాలిక అధ్య‌క్షురాలిగా కొన‌సాగుతున్నారు.

ఈ నేప‌థ్యంలో అధ్య‌క్ష ప‌ద‌వికి ఎవ‌రూ పోటీ చేస్తార‌నే అంశంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

Advertisement
God Of Coins Player Safety And Responsible Gambling (UK)