Singareni Notification : సింగరేణిలో 272 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..!

సింగరేణి( Singareni )లో 272 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్( Notification ) విడుదల అయింది.ఈ మేరకు తొలి విడతలో 272 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు సింగరేణి సీఎండీ బలరాం( Singareni CMD Balaram ) ప్రకటించారు.

ఎగ్జిక్యూటివ్ క్యాడర్ లో మేనేజ్ మెంట్ ట్రైనీ ఈ2 ట్రేడ్ 139 పోస్టులు, మేనేజ్ మెంట్ ట్రైనీ (ఎఫ్ అండ్ ఏ), ఈ 2 గ్రేడ్ 22 పోస్టులు, మేనేజ్ మెంట్ ట్రైనీ (హైడ్రో జియాలజిస్ట్) ఈ2 గ్రేడ్ 2 పోస్టులు, మేనేజ్ మెంట్ ట్రైనీ (సివిల్) ఈ2గ్రేడ్ 18 పోస్టులు, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (ఐఈ) ఈ2 గ్రేడ్‌ 10 పోస్టులు, జూనియర్‌ ఎస్టేట్‌ ఆఫీసర్‌ ఈ1 గ్రేడ్‌ పది పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.అలాగే నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ క్యాడర్‌లో సబ్‌ ఓవర్సీర్‌ ట్రైనీ (సివిల్‌) ఈఅండ్‌ఎస్‌ గ్రేడ్‌-సీలో 16 పోస్టులు, జనరల్‌ డిప్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌ (జీడీఎంవోస్‌) ఈ3 గ్రేడ్‌ 30 పోస్టులను భర్తీ చేయనున్నారు.ఈ మేరకు అభ్యర్థులు మార్చి 1 నుంచి మార్చి 18వ తేదీ లోపు దరఖాస్తులు చేసుకోవాలని సీఎండీ తెలిపారు.

నగ్నంగా పూజ చేస్తే లక్ష్మీదేవి వరిస్తుంది... విద్యార్థినిని మభ్యపెట్టిన కేటుగాళ్లు?

తాజా వార్తలు